40 రోజుల్లో 4 లక్షల అమ్మకాలు, అమెజాన్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ ఇదే

చైనా దిగ్గజం ఒప్పో అమెజాన్ పార్టనర్‌గా రియల్‌మి 1 అనే స్మార్ట్‌ఫోన్‌ను ఈ మధ్య లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

|

చైనా దిగ్గజం ఒప్పో అమెజాన్ పార్టనర్‌గా రియల్‌మి 1 అనే స్మార్ట్‌ఫోన్‌ను ఈ మధ్య లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగి కొత్త రికార్డును సృష్టించాయని కంపెనీ తెలిపింది. మే నెలలో విడుదలైన ఈ ఫోన్ కేవలం 40 రోజుల్లోనే 4 లక్షల యూనిట్ల వరకు అమ్ముడైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఈ గణాంకాలను నమోదు చేసింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు విశేష రీతిలో స్పందన వస్తున్నది. అందుకే ఆ స్థాయిలో రియల్‌మి 1 ఫోన్ల అమ్మకాలు జరిగాయని రియల్‌మి సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు.

 

స్టూడెంట్స్‌కు బంపరాఫర్ ఇస్తున్న వన్‌ప్లస్‌స్టూడెంట్స్‌కు బంపరాఫర్ ఇస్తున్న వన్‌ప్లస్‌

మొదటి స్థానం

మొదటి స్థానం

ప్రస్తుతం రియల్‌మి1 ఫోన్ అమెజాన్ ఇండియా సైట్‌లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ ర్యాంకింగ్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. గత రెండు నెలలుగా అమెజాన్ సైట్‌లో అత్యధిక రేటింగ్‌ను సాధించిన ఫోన్‌గా కూడా రియల్‌మి 1 రికార్డుకెక్కింది.

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు

రియ‌ల్‌మి1 ఫీచ‌ర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 ధర
 

ధర

3/4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ సిల్వర్, డైమండ్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు లభిస్తుండగా వీటి ధరలు వరుసగా రూ.8,990, రూ.10,990, రూ.13,990గా ఉన్నాయి. ఫోన్‌తోపాటు బాక్స్‌లో ఉచితంగా స్క్రీన్ గార్డ్‌ను అందిస్తున్నారు.

6 ఇంచుల భారీ డిస్‌ప్లే

6 ఇంచుల భారీ డిస్‌ప్లే

రియల్‌మి 1 ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేనందున ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండు సిమ్ కార్డులు

రెండు సిమ్ కార్డులు

ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, రెండు సిమ్ కార్డులు వేసుకునే విధంగా మూడు వేర్వేరు డెడికేటెడ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న 3410 ఎంఏహెచ్ బ్యాటరీ వల్ల ఫోన్ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది.

లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే..

లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే..

లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే ఎస్‌బీఐకార్డు ద్వారా కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉచితం. జియో ద్వారా 4850 రూపాలయ అదనపు ప్రయోజనం.కాగా ఏడు లేయర్లతో కూడిన సిరామిక్ టెక్నాలజీతో ఫోన్ బాడీని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Oppo Realme 1 India Sales Cross 400,000 Units in 40 Days, Company Says more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X