రెడ్‌మి,శాంసంగ్ ఫోన్లకు ఊహించని షాకిచ్చిన Realme 1
చైనాకు చెందిన ఒప్పో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలకు ఊహించని రీతిలో సరి కొత్త సవాల్ విసిరింది.
చైనాకు చెందిన ఒప్పో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలకు ఊహించని రీతిలో సరి కొత్త సవాల్ విసిరింది. చైనా దిగ్గజం ఒప్పో షియోమి, శాంసంగ్‌లను సవాల్ చేస్తూ రియల్ మీ బ్రాండ్‌లో తొలి డివైస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.ముఖ‍్యంగా ఇండియన్ యూత్‌ను, ఇ-కామర్స్ చానెల్స్ టార్గెట్‌గా దీన్ని లాంచ్ చేసింది. రియల్ మి 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా మార్కెట్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 'మేడ్ ఇన్ ఇండియా' లో భాగంగా ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. కాగా రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. ఫీచర్లు ,ధర విషయానికొస్తే..

రియల్‌మి1 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

మూడు వేరియంట్లలో..
మూడు వేరియంట్లలో విడుదలైన వీటి ధరలు 3జీబీర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,990, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10990, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13990గా ఉండనున్నాయి.

మే25న అమెజాన్ ఇండియాలో..
మే25న అమెజాన్ ఇండియాలో రియల్ మీ1 ( 6జీబీ/128 జీబీ) మొదటి అమ్మకాలు మధ్నాహ్నం 12 గంటలకు మొదలు కానుంది. 3 జీబి ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్, 4 జీబి ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ స్మార్ట్‌ఫోన్లు ఒక నెల తరువాత అంటే జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి.

లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే..
లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఎస్‌బీఐకార్డు ద్వారా కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉచితం. జియో ద్వారా 4850 రూపాలయ అదనపు ప్రయోజనం.కాగా ఏడు లేయర్లతో కూడిన సిరామిక్ టెక్నాలజీతో ఫోన్ బాడీని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది.

6 ఇంచుల భారీ డిస్‌ప్లే
రియల్‌మి 1 ఫోన్‌లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేనందున ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మెమొరీ కార్డు, రెండు సిమ్ కార్డులు,,
ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు, రెండు సిమ్ కార్డులు వేసుకునే విధంగా మూడు వేర్వేరు డెడికేటెడ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న 3410 ఎంఏహెచ్ బ్యాటరీ వల్ల ఫోన్ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. మూన్‌లైట్ సిల్వర్, డైమండ్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు లభిస్తోంది.


Click it and Unblock the Notifications








