అద్భుత ఫీచర్లు, అత్యంత తక్కువ ధరతో రియల్‌ మి2

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి 2 భారత మార్కెట్లో లాంచ్‌ అయింది.

|

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి 2 భారత మార్కెట్లో లాంచ్‌ అయింది. గతంలో వచ్చిన రియల్‌‌మి 1 డివైస్‌ భారీ విక్రయాలను నమోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్‌‌మి2ను రెండు వేరియంట్లలో కంపెనీ తాజాగా లాంచ్‌ చేసింది. రియల్‌మి 1కు మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి రియల్‌మి 2ను తీసుకొచ్చింది. నాచ్‌ డిస్‌ప్లే‌తో పాటు, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఇక వెనుకవైపు రెండు కెమెరాలతో పాటు డైమండ్‌ కట్‌ డిజైన్‌ దీని అదనపు ఆకర్షణలు. అందరూ ఊహించినట్టుగానే బడ్జెట్‌ ధరలోనే దీన్ని విడుదల చేసింది.

ఎస్‌బిఐ డెబిట్ కార్డ్ దారులకు హెచ్చరికఎస్‌బిఐ డెబిట్ కార్డ్ దారులకు హెచ్చరిక

రియల్‌ మి 2 ఫీచర్లు

రియల్‌ మి 2 ఫీచర్లు

6.21 అంగుళాల నాచ్‌ ఫుల్‌స్క్రీన్ డిస్‌ప్లే
720x1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
19:9 యాస్పెక్ట్ రేషియో
1.8 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
3జీబీ/4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ, మెమొరీ కార్డుతో 256జీబీ వరకు మెమొరీని పెంచుకునే సామర్థ్యం
13+2ఎంపీ డ్యుయల్‌రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4230ఎంఎహెచ్‌ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌

ధర

ధర

బేసిక్‌ మోడల్‌ 3జిబి ర్యామ్ ఫోన్‌ను రూ. 8,990 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.10,990గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా

ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా

ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను విడుదల చేశారు. సెప్టెంబరు 4 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్‌ను నిర్వహించనున్నారు.

నీలం, డైమండ్‌ బ్లాక్‌, డైమండ్‌ రెడ్‌ రంగుల్లో

నీలం, డైమండ్‌ బ్లాక్‌, డైమండ్‌ రెడ్‌ రంగుల్లో

నీలం, డైమండ్‌ బ్లాక్‌, డైమండ్‌ రెడ్‌ రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అయితే తొలి సేల్‌లో కేవలం డైమండ్‌ బ్లాక్‌, డైమండ్‌ రెడ్‌ రంగుల్లోని ఫోన్లను మాత్రమే విక్రయించనున్నారు. అక్టోబర్‌లో నీలం రంగు ఫోన్లను విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

 క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా..

క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా..

ఈ ఫోన్‌పై కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 750 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు.

జియో యూజర్లు

జియో యూజర్లు

ఇక జియో యూజర్లు 120జీబీ అదనపు డేటాతో పాటు రూ. 2,200 క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో పొందవచ్చు.

రియల్‌మి 1

రియల్‌మి 1

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, మొబైల్స్ తయారీదారు ఒప్పోల సంయుక్త భాగస్వామ్యంలో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బ్రాండ్ కింద రియల్‌మి 1 ఫోన్‌ను విడుదల చేశారు.

రియల్‌మి 1 ఫీచర్లు

రియల్‌మి 1 ఫీచర్లు

భారీ స్థాయిలో అమ్మకాలను కొల్లగొట్టిన రియల్‌మి 1 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 

ధరలు

ధరలు

3/4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ సిల్వర్, డైమండ్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు లభిస్తుండగా వీటి ధరలు వరుసగా రూ.8,990, రూ.10,990, రూ.13,990గా ఉన్నాయి. ఫోన్‌తోపాటు బాక్స్‌లో ఉచితంగా స్క్రీన్ గార్డ్‌ను అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Oppo Realme 2 With Snapdragon 450 SoC Launched in India, Price Starts at Rs. 8,990 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X