షియోమి రెడ్‌మి ఫోన్లను టార్గెట్ చేస్తున్న మరో చైనా కంపెనీ
దేశీయ మొబైల్ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
దేశీయ మొబైల్ మార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చైనా స్మార్‌ఫోన్ కంపెనీలు ఇండియా మార్కెట్‌ని పూర్తిగా ఆక్రమించాయి. దేశీయ కంపెనీలను టార్గెట్ చేస్తూ దూసుకొచ్చిన ఈ కంపెనీలు ఇండియాలో కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతూ మనదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు చైనా కంపెనీల మధ్యనే పోరు మొదలైంది. ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీ షియోమికి ఒప్పో సబ్ బ్రాండ్ కంపెనీ రియల్ మి సవాల్ విసురుతూ తన సరికొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది.

ఆగస్టు 28న..
రియల్‌మి 2ను మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లోకి రాబోతోంది. ఆగస్టు 28న జరగనున్న ఈ కార్యక్రమానికి కంపెనీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.

తొలి మొబైల్‌గా రియల్ మి 1
తొలి మొబైల్‌గా రియల్ మి 1 డివైస్ భారీ విక్రయాలనున మోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్ మి2 కూడా అదే స్థాయిలో అమ్మకాలను రాబడుతుందని కంపెీనీ చెబుతోంది.

డ్యుయల్ రియర్ కెమెరాలు
డ్యుయల్ రియర్ కెమెరాలు, నోచ్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేషియల్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్లుగా రియల్ మి 2ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇక దీని ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి.

పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలను..
అయితే రియల్‌మి 2కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్ల వివరాలను మాత్రం రియల్ మి ఇంకా వెల్లడించలేదు.

లీకయిన వివరాల ప్రకారం..
6.23 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
19:9 యాస్పెక్ట్ రేషియో
మీడియా టెక్ హీలియో పీ60
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్
1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషన్
16+2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్
4230ఎంఎహెచ్ బ్యాటరీ

ఫ్లిప్‌కార్ట్‌లో..
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.10వేల లోపే నిర్ణయించవచ్చని అంచనా.

రియల్‌మి 1
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, మొబైల్స్ తయారీదారు ఒప్పోల సంయుక్త భాగస్వామ్యంలో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బ్రాండ్ కింద రియల్‌మి 1 ఫోన్‌ను విడుదల చేశారు.

రియల్‌మి 1 ఫీచర్లు
భారీ స్థాయిలో అమ్మకాలను కొల్లగొట్టిన రియల్‌మి 1 ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3410 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధరలు
3/4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన రియల్‌మి 1 స్మార్ట్‌ఫోన్ మూన్‌లైట్ సిల్వర్, డైమండ్ బ్లాక్ రంగుల్లో వినియోగదారులకు లభిస్తుండగా వీటి ధరలు వరుసగా రూ.8,990, రూ.10,990, రూ.13,990గా ఉన్నాయి. ఫోన్‌తోపాటు బాక్స్‌లో ఉచితంగా స్క్రీన్ గార్డ్‌ను అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








