Home
Mobile

ఈ ఒప్పో ఫోన్ పై రూ.2000 ధర తగ్గింది ! కొత్త ధర, ఆఫర్ వివరాలు

ఒప్పో సంస్థ Oppo రెనో 10 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ధరను రూ.2,000 తగ్గించింది. భారతదేశంలో తదుపరి తరం ఒప్పో రెనో 11 లైనప్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ ధర తగ్గింపు ప్రత్యేకంగా నిలుస్తుంది. ధర తగ్గిన తర్వాత కొత్త ధర వివరాలు మరియు ఇతర ఆఫర్ల వివరాలు గమనించండి.

ఒప్పో రెనో 10 ప్రో 5G ఈ ఏడాది జూలైలో సాధారణ ఒప్పో రెనో 10 5G మరియు ఒప్పో రెనో 10 ప్రో+ 5G తో పాటు లాంచ్ చేయబడింది. ఇది 6.7 అంగుళాల పూర్తి-HD+ OLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778G 5G SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఒప్పో రెనో 10 ప్రో 5G ఫోన్ 80W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది.

Oppo Reno 10 Pro 5G Price Cut By Rs.2000 In Indian Market, New Price Details And Offers Here.

భారతదేశంలో Oppo Reno 10 Pro 5G కొత్త ధర
ఒప్పో రెనో 10 ప్రో 5G భారతదేశంలో జూలైలో లాంచ్ చేయబడింది. దీని ధర ఏకైక 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం లాంచ్ సమయంలో రూ.39,999 గా ఉండేది. అయితే, ప్రస్తుతం, ఈ హ్యాండ్‌సెట్ ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 37,999 అందుబాటులో ఉంది. ఈ కొత్త ధర ట్యాగ్ రిలయన్స్ మరియు క్రోమాతో సహా ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో చూపబడుతోంది. ఇది గ్లోసీ పర్పుల్ మరియు సిల్వరీ గ్రే షేడ్స్‌ కలర్ లో వస్తుంది.

నివేదికలు విడుదలయినట్లుగా, చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తన కొత్త ఒప్పో రెనో 11 మరియు ఒప్పో రెనో 11 ప్రో లను చైనాలో ఆవిష్కరించిన కొద్ది రోజుల తర్వాత ఈ ధర తగ్గింపు ప్రకటించారు. ఈ ఫోన్‌లు త్వరలో భారత్‌లో కూడా లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.

Oppo Reno 10 Pro 5G స్పెసిఫికేషన్ ల వివరాలు
ఒప్పో రెనో 10 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ColorOS 13.1 పై పనిచేస్తుంది. మరియు HDR10+ సపోర్ట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080X 2,412 పిక్సెల్‌లు) OLED 3D కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ మరియు 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778G 5G SoC ప్రాసెసర్ ని కలిగి ఉంది. దీనితో పాటు గరిష్టంగా 12GB RAM ఉంది. RAMని వర్చువల్‌గా 8GB వరకు విస్తరించవచ్చు.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఒప్పో రెనో 10 ప్రో 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX890 సెన్సార్, OIS, 32-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇది ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఇంకా, గరిష్టంగా 256GB UFS 3.1 స్టోరేజ్, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఈ హ్యాండ్‌సెట్ యొక్క ఇతర ముఖ్య విషయాలు. ఇది 80W సూపర్ ఊక్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 10 Pro 5G Price Cut By Rs.2000 In Indian Market, New Price Details And Offers Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X