50MP+ 8MP+ 32MP కెమెరాలు, 12GB ర్యామ్ Oppo స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
ఒప్పో నుంచి రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు జులై 12 విడుదల కానున్నాయి. ఈ సిరీస్ కు సంబంధించిన కీలక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ కొత్త సిరీస్ విడుదలకు ముందు ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్ ఫోన్ (Oppo Reno 11 Pro Smartphone Price Cut) ధరను తగ్గించింది. ఈ హ్యాండ్ సెట్ పుల్ HD+ డిస్‌ప్లే మరియు మీడియాటెక్ చిప్ సెట్ పైన పనిచేస్తుంది.
రూ.2000 ధర తగ్గింపు సహా 10 శాతం డిస్కౌంట్ : ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల సమయంలో ప్రారంభ ధర రూ.39,999 గా ఉంది. ఈ హ్యాండ్ సెట్ ధరను సంస్థ రూ.2000 తగ్గించింది. ఫలితంగా ధర రూ.37,999 గా ఉంది. దీంతోపాటు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.

ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్ ఫోన్ 1080*2412 పిక్సల్ రిజల్యూషన్ తో 6.7 పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంటుంది.
రెండు వేరియంట్‌లో : ఆండ్రాయిడ్ 14 ఆధారిత colorOS 14 పైన పనిచేస్తుంది. అండర్ ది హుడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ సెట్ ను కలిగి ఉంది. Arm Mali G610 GPU సహా 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీతో లభిస్తుంది.
32MP సెల్ఫీ కెమెరా : కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్ తో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సహా f/2.0 అపేచర్‌తో 32MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ ఒప్పో రెనో 11 స్మార్ట్ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.3, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్ సెట్ పెర్ల్ వైట్, రాక్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








