32MP సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్‌తో Oppo కొత్త ఫోన్ లాంచ్ అయింది.. స్పెసిఫికేషన్లు, ధర, వివరాలు..!
ఒప్పో ఇటీవల భారత్‌లో ఒప్పో రెనో 11 5G మరియు ఒప్పో రెనో 11 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ సిరీస్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 ను కలిగి ఉంది. అయితే తాజాగా ఒప్పో సంస్థ Oppo Reno 11F 5G స్మార్ట్‌ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. భారత్‌లో ఈ ఫోన్ వేరే పేరుతో లాంచ్ కానుంది.
ఒప్పో రెనో 11F 5G ధర :
ఒప్పో రెనో 11F 5G స్మార్ట్‌ఫోన్ కోరల్ పర్పల్, ఓసియన్ బ్లూ, పామ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే థాయ్‌లాండ్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ ధర THB 10990 (భారత కరెన్సీ ప్రకారం రూ.25,540) గా ఉంది. భారత్‌లో ఈ మోడల్ లాంచ్ కానుందా లేదా అనే దానిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే వచ్చిన లీక్‌ల ఆధారంగా ఒప్పో రెనో 11F 5G స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో ఒప్పో F25 గా లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఒప్పో రెనో 11F 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 11F 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1082*2412 పిక్సల్ రిజల్యూషన్ మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 1100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు ట్వైస్ రెయిన్‌ఫోర్సడ్ పండా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC చిప్ మరియు ARM Mail G68 MC4 GPU.. LPDDR4x 8GB ర్యామ్ మరియు UFS 3.1 256GB స్టోరేజీతో జతచేయబడుతుంది. మరో 8GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను విస్తరించవచ్చు.
Oppo రెనో 11F 5G స్మార్ట్‌ఫోన్ 64MP OV64B ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో వస్తుంది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉంటుంది.
ఒప్పో రెనో 11F 5G హ్యాండ్‌సెట్ 67W సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్వాష్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు కనెక్టివిటీ పరంగా వైఫై-6, బ్లూటూత్ 5.2, NFC, GPS, GLONASS, Galileo మరియు USB-C ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. అయితే ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో ఒప్పో F25 గా లాంచ్ కానుందని కొన్ని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications