Home
Mobile

ఒప్పో రెనో 12 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ లీక్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!!

ఒప్పో నుంచి గత నెలలో A3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. తాజాగా రెనో 12 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే వారంలో భారత్‌లో లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 12 5G మరియు ఒప్పో రెనో 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు (Oppo Reno 12 5G Series Smartphone) లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీ సహా ర్యామ్‌, స్టోరేజీ వేరియంట్ల వివరాలు లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌ ఇటీవలే కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.

ఒప్పో రెనో 12 5G సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌ మార్కెట్‌లో విడుదలపై టెక్‌అవుట్‌లుక్‌ రిపోర్టు కీలక వివరాలు వెల్లడించింది. ఈ సిరీస్‌ జులై 12న విడుదల కానుందని తెలిపింది. మరియు రెనో 12 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీలో లాంచ్‌ కానుంది. అదే ప్రో మోడల్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ మరియు 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

Oppo Reno 12 5G series could launch on july 12 in india

చైనా మినహా ఇతర గ్లోబల్ మార్కెట్‌లలో ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఇలా ఉన్నాయి. ఆ దేశాల్లో రెనో 12 5G.. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర EUR 499.99 (భారత్ మార్కెట్‌లో సుమారు రూ.44,700) గా ఉంది. అదే ప్రో మోడల్ 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర EUR 599.99 (భారత్‌ మార్కెట్లో సుమారుగా రూ.53,700) గా ఉంది.

ఒప్పో రెనో 12 5G సిరీస్‌ ఫ్లిప్‌కార్ట్‌ మరియు ఒప్పో ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఆయా వెబ్‌సైట్‌లు ఇందుకోసం ప్రత్యేక పేజీలను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయి.

గ్లోబల్‌ మార్కెట్లో ఒప్పో రెనో 12 సిరీస్ ఫీచర్‌లు :
ఈ సిరీస్‌ 6.7 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ సిరీస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ చిప్‌సెట్‌ల పైన పనిచేస్తోంది. ఈ రెండు ఫోన్‌లు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. అలాగే 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. 60fps వరకు 4K నాణ్యతతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 12 5G series Smartphones india launch date tipped
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X