ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు.. 50MP టెలీఫొటో కెమెరా సహా కీలక ఫీచర్‌లు..!!
ఒప్పో నుంచి జూన్ 13 న భారత్ మార్కెట్‌లో ఒప్పో F27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. దీంతోపాటు ఒప్పో A3 ప్రో భారత్ వేరియంట్ కూడా త్వరలో లాంచ్ కానుంది. అయితే వీటితోపాటు ఒప్పో రెనో 12 సిరీస్ (Oppo Reno 12 Series) ప్రపంచవ్యాప్తంగా జూన్ 18న విడుదల కానుంది. అయితే ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనాలో విడుదల అయ్యాయి. ఈ రెనో 12 సిరీస్‌లో భాగంగా రెనో 12 మరియు రెనో 12 ప్రో హ్యాండ్‌సెట్‌లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్ జనరేటివ్ AI ఫీచర్‌లను కలిగి ఉండనున్నాయి.
ఒప్పో రెనో 12 సిరీస్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో రెనో 12 మరియు 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 6.7 అంగుళాల పుల్ HD+ 1.5k కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ 2తో రక్షణ పొందుతుంది.

ఒప్పో రెనో 12 స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటి 8250 స్టార్ స్పీడ్ ఎడిషన్ SOC పైన పనిచేయనుందని తెలుస్తోంది. అదే ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెడ్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్లు 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రధాన కెమెరా, 50MP టెలీఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 80W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.
చైనాలో ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు AI పొర్ట్రెయిట్ మరియు AI లింక్‌బూస్ట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. చైనాలో ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రారంభ ధర CNY 2699 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.31,000) గా ఉంది. ఈ గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లపై ఒప్పో ఎటువంటి ప్రకటన చేయలేదు.
** భారత్ మార్కెట్‌లో ఒప్పో F27 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ నిన్న (జూన్ 13) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల 3D కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 67W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ 20 నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications