6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరాతో ఒప్పో 5G స్మార్ట్‌ఫోన్ .. స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!
ఒప్పో రెనో 12 సిరీస్‌ను సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 12 మరియు రెనో 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు (Oppo Reno 12 series smartphones) ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో అందుబాటులోకి వచ్చింది. అయితే చైనాలో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు మరియు తాజాగా ఆవిష్కరించిన మోడళ్ల మధ్య కొన్ని మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ OLED డిస్‌ప్లే, మీడియాటెక్ చిప్‌సెట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు..
ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్‌లు:
ఈ రెనో 12 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394 ppi పిక్సల్ డెన్సిటీ, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 20:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. HDR 10+ ను సపోర్టు చేస్తుంది. గొరెల్లా గ్లాస్ 7i తో డిస్‌ప్లే రక్షణ పొందుతుంది.

ఒప్పో రెనో 12 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 12GB LPDDR4x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఒప్పో రెనో 12 స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ LYT600 కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. ముందువైపు ఆటోఫోకస్ సామర్థ్యంతో f/2.0 అపేచర్‌తో 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ ఒప్పో రెనో 12 సిరీస్‌లో.. రెనో 12 సహా రెనో 12 ప్రో మోడళ్లు ఉన్నాయి. అయితే ఒప్పో రెనో 12, రెనో 12 ప్రో మోడళ్లు ఒకే విధమైన డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ సహా ఇతర చిప్‌సెట్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కలిగి ఉంటాయి.
అయితే రెనో 12 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ మాత్రం అదనంగా ఆటో ఫోకస్ సామర్థ్యం, f/2.0 అపేచర్‌తో 50MP టెలిఫోటో కెమెరాను అమర్చారు. మరియు ముందు వైపు f/2.0 అపేచర్‌తో 50MP ఆటోఫోకస్ సామర్థ్యం కలిగిన సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఒప్పో రెనో 12 సిరీస్ ప్రారంభ ధర యూరప్‌లో EUR 499 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.44,700) గా ఉంది. యూరప్ మార్కెట్‌లో ఈ సిరీస్ జూన్ 25 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అయితే భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలను సంస్థ విడుదల చేయలేదు.
ఒప్పో రెనో 12 స్మార్ట్‌ఫోన్ మ్యాటీ బ్రౌన్, సన్‌సెట్ పింక్, ఆస్ట్రో సిల్వర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అదే రెనో 12 ప్రో మోడల్ హ్యాండ్‌సెట్ స్పేస్ బ్రౌన్, సన్‌సెట్ గోల్డ్, నెబోలా సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. అయితే భారత్‌లో ఇదే రంగుల్లో లభించనున్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications