ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ వెల్లడి.. ఈ ఫోన్‌ను వాకీ టాకీ తరహాలో వినియోగించుకోవచ్చు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి రెనో 12 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని వారాల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 5G, ఒప్పో రెనో 12 ప్రో 5G హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఈ సిరీస్ భారత్‌లో త్వరలో విడుదల కానుంది. జులై 12న ఈ రెండు ఫోన్లను (Oppo Reno 12 Series Launch Date) విడుదల చేస్తున్నట్లు ఒప్పో అధికారికంగా ప్రకటన చేసింది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కలిగి ఉండనుంది.
ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ 80W సూపర్ వోక్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ ఛార్జ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. కేవలం 46 నిమిషాల్లో 0-100 శాతం బ్యాటరీ ఛార్జింగ్ చేయవచ్చని ఒప్పో వెల్లడించింది.

ఒప్పో రెనో 12 సిరీస్ అంచనా స్పెసిఫికేషన్‌లు :
భారత్ వేరియంట్ ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే చైనా వేరియంట్ రెనో 12 హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14.1 పైన పనిచేస్తుంది.
ఈ రెనో 12 స్మార్ట్‌ఫోన్ చైనా వేరియంట్ 6.7 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394 PPI పిక్సల్ డెన్సిటి సహా 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
రెనో 12 చైనా వేరియంట్ 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 32MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. అదే ప్రో మోడల్ 50MP టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. మరియు 50MP సెల్ఫీ కెమెరానుతో చైనాలో అందుబాటులో ఉంది.
ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆసక్తికరమైన ఫీచర్‌ను కలిగి ఉండనుంది. ఈ సిరీస్ బికాన్‌లింక్ టెక్నాలజీను కలిగి ఉంటుందని.. టెలికాం నెట్‌వర్క్ అంతరాయాల సమయంలో వాకీ టాకీ తరహాలో పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా మాట్లాడుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఒప్పో ఆధారంగా ఈ రెనో 12 సిరీస్ ఇండియన్ వేరియంట్ ఇన్‌బిల్ట్ AI ఫీచర్లను కలిగి ఉంటాయి. AI బెస్ట్ ఫేస్, AI ఎరేజర్, AI స్టూడియో, AI సమ్మరి, AI క్లియర్ ఫేస్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ కానుంది. ఈ సిరీస్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుందని సమాచారం. త్వరలో కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








