Home
Mobile

50MP + 50MP + 50MP సెల్ఫీ కెమెరాలు, 512GB స్టోరేజీ, IP69 రేటింగ్‌తో OPPO 5G ఫోన్‌ విడుదల..!

ఒప్పో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి ఇవాళ ఒప్పో రెనో 13 సిరీస్‌ (Oppp Reno 13 Series Launched) విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సిరీస్‌లో సూపర్‌ కెమెరాలను అమర్చారు. ఫలితంగా అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఒప్పో రెనో 13 సిరీస్‌ సెగ్మెంట్‌లోనే తొలి ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ సిరీస్‌ OPPO X1 సిగ్నల్‌ బూస్ట్ చిప్‌ను కలిగి ఉంది. ఫలితంగా వైఫై ట్రాన్సిమిషన్ పవర్‌ 25 శాతం మెరుగవుతుంది. ఈ రెండు మోడళ్లు IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయ్యాయి.

Oppo Reno 13 series

ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు : ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్‌ (Oppp Reno 13 Smartphone) 6.59 అంగుళాల (2760*1256 పిక్సల్స్‌) 1.5k ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఫోన్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR5X ర్యామ్ మరియు గరిష్ఠంగా 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Oppo Reno 13 series

50MP + 50MP సెల్ఫీ కెమెరా :
కెమెరాల పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP LYT600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను అమర్చి ఉంది. మరియు f/2.0 అపేచర్‌తో 50MP JN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

సూపర్‌ AI ఫీచర్‌లు :
ఈ ఫోన్ AI లైవ్‌ఫోటో, అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీ, AI రీఇమేజ్‌, AI క్లారిటీ ఎన్‌హేన్సర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 80W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.4 కలిగి ఉంది. ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్‌ లుమినస్‌ బ్లూ మరియు ఐవరీ వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

Oppo Reno 13 series

ఒప్పో రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు : ప్రో మోడల్‌ (Oppp Reno 13 Pro Smartphone) 6.83 అంగుళాల (2800*1272 పిక్సల్స్‌) క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీని కలిగి ఉంది.

512GB స్టోరేజీ :
రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Color OS 15 ను కలిగి ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది.

50MP + 50MP + 50MP సెల్ఫీ కెమెరాలు
కెమెరా విభాగం పరంగా ప్రో మోడల్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 50MP JNS టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను అమర్చి ఉంది. f/2.0 అపేచ్‌తో 50MP JN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI లైవ్‌ఫోటో, అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీ, AI రీఇమేజ్‌, AI క్లారిటీ ఎన్‌హేన్సర్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

ఒప్పో రెనో 13 సిరీస్‌ ధర సేల్‌ వివరాలు :
ఒప్పో రెనో 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో రెనో 13 సిరీస్‌ ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు మోడళ్లు IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయ్యాయి.

ఒప్పో రెనో 13 5G ఫోన్‌ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. అదే ప్రో మోడల్‌ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. ప్రో మోడల్‌ మిస్ట్‌ లావెండర్, గ్రాఫైట్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 13 and Reno 13 Pro smartphones launched with 50MP Front Camera and AI Features in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X