512GB స్టోరేజ్‌తో, కొత్త స్కై బ్లూ కలర్‌లో ఒప్పో రెనో 13 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
OPPO Reno 13: ఒప్పో కంపెనీ తమ రెనో 13 ఫోన్‌ని ఇండియాలో సరికొత్త రంగులో లాంచ్ చేసింది. ఇకపై ఈ ఫోన్ \"స్కై బ్లూ\" కలర్‌లో కూడా దొరుకుతుంది. అంతే కాదు, ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వాళ్ల కోసం ఏకంగా 12GB RAM, 512GB స్టోరేజ్‌తో కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఈ ఫోన్ \"ల్యూమినస్ బ్లూ\", \"ఐవరీ వైట్\" రంగుల్లోనే దొరికేది. ఇప్పుడు కొత్త రంగు, ఎక్కువ స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ మోడల్‌లో ఫీచర్లు మాత్రం పాత మోడల్స్‌లాగే సేమ్ టు సేమ్ ఉంటాయి. ధర విషయానికొస్తే, 12GB RAM + 512GB స్టోరేజ్ ఉన్న స్కై బ్లూ మోడల్ ధర రూ.43,999. 8GB RAM + 256GB మోడల్ రూ.39,999కి లభిస్తుంది.

బేసిక్ మోడల్ అయిన 8GB RAM + 128GB వేరియంట్ ధర మాత్రం పాత ధరకే అంటే రూ.37,999 కే అందుబాటులో ఉంది. ఈ కొత్త రెనో 13 వేరియంట్‌ని మార్చి 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, ఓప్పో అధికారిక ఆన్‌లైన్ స్టోర్, ఇంకా దగ్గరలోని మొబైల్ షాపుల్లో కొనుక్కోవచ్చు.
* ఒప్పో రెనో 13 ఫీచర్లు ఇవే..
రెనో 13 ఫోన్‌లో 6.59-అంగుళాల 1.5K మైక్రో-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది చూడటానికి చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇంకా 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి.
సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ బాగా కనిపించేలా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే, వెనుకవైపు 50MP సోనీ LYT600 మెయిన్ కెమెరా (OIS తో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు కూడా ఏకంగా 50MP కెమెరా ఇచ్చారు.
* ప్రాసెసర్
ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, మాలి-G615 GPU అందించారు. కాబట్టి గేమ్స్ ఆడినా, మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ ఏ మాత్రం ల్యాగ్ అవ్వదు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్OS 15తో వస్తుంది. ఇందులో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా అదిరిపోతుంది.
5,600mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే బ్యాటరీ అయిపోతే చకచకా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లేలోనే ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66/68/69 రేటింగ్ కూడా కలిగి ఉంది. అంటే దుమ్ము, నీళ్లలో పడ్డా పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు.
* కనెక్టివిటీ & పోటీదారులు
రెనో 13 ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఒకవేళ వేరే ఫోన్లు కూడా చూడాలనుకుంటే, మార్కెట్‌లో రియల్‌మీ GT 6 (ధర రూ.40,999), వన్‌ప్లస్ 13R (ధర రూ.42,999), శామ్‌సంగ్ గెలాక్సీ A36 (ధర రూ.32,999) వంటి మంచి ఫోన్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








