Home
Mobile

ట్రిపుల్‌ కెమెరాలు, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఒప్పో కొత్త ఫోన్‌లు.. ఎప్పుడు లాంచ్‌ కానున్నాయంటే..?

ఒప్పో నుంచి భారత్‌ మార్కెట్‌లో రెనో 13 సిరీస్‌ (Oppo Reno 13 Series launch Date) విడుదల తేదీ వెల్లడైంది. ఈ సిరీస్‌లో భాగంగా రెనో 13 మరియు రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. తాజాగా ఒప్పో ఇండియా ఈ రెండు ఫోన్‌ల విడుదల తేదీలను ప్రకటన చేసింది. మరియు ఈ సిరీస్‌ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌ సహా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానున్నాయి.

ఒప్పో రెనో 13 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో జనవరి 9 వ తేదీ 5:00 PM గంటలకు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ చైనాలో గత నవంబర్‌లోనే విడుదల అయ్యాయి. ఫలితంగా ఈ ఫోన్‌ల డిజైన్‌ సహా ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ఆధారంగా భారత్ వేరియంట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.

Oppo reno 13 series smartphones launch date

ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.59 అంగుళాల (2760*1256 పిక్సల్స్‌) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ ను కలిగి ఉండనుంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. 8GB ర్యామ్‌ మరియు 256GB స్టోరేజీ జతచేసి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ColorOS 15 తో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP OIS ప్రైమరీ కెమెరాను అమర్చి ఉంటుంది. ఇతర కెమెరా స్పెసిఫికేషన్‌ల గురించి తెలియాల్సి ఉంది. దీంతోపాటు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ కానుంది.

ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్‌ 80W వైర్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్డ్‌ మైక్రో సైట్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ గ్రాఫైట్‌ గ్రే, లుమినస్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 181 గ్రాముల బరువును కలిగి ఉంది.

ఒప్పో రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.82 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల కానుంది. ఈ డిస్‌ప్లే 2800*1271 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీను సపోర్టు చేస్తుంది. ఈ ప్రో మోడల్‌ ఒప్పో X1 చిప్‌సెట్‌ సహా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మరియు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మిస్ట్‌ లావెండర్‌, గ్రాఫైట్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.30,000 ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ ధర రూ.40000 ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఈనెల 9 వ తేదీన విడుదల కానుంది. మరింత కచ్చితమైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo reno 13 series smartphones launch date confirmed in india check specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X