Oppo రెనో 13 సిరీస్ సేల్ ప్రారంభం.. ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్..!
ఒప్పో రెనో 13 సిరీస్ ఇటీవల భారత్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా రెనో 13, రెనో 13 ప్రో మోడళ్లు విడుదల అయ్యాయి. ఈ రెండు ఫోన్‌ల సేల్ (Oppo Reno 13 Series Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్‌లు అనేక అద్బుతమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లు సహా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో లాంచ్ అయింది.
ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ (Oppo Reno 13) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.37,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ప్రో (Oppo Reno 13 Pro)మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.49,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది.

ఈ సిరీస్‌ను ఒప్పో అధికారిక వెబ్‌సైట్ సహా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. SBI కార్డు, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.3000 ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు. మరియు 9 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయం ఉంది. రెనో 13 స్మార్ట్‌ఫోన్ లుమినస్ బ్లూ మరియు ఐవరీ వైట్.. ప్రో మోడల్ మిస్ట్ లావెండర్, గ్రాఫైట్ గ్రే రంగుల్లో లభిస్తున్నాయి.
ఒప్పో రెనో 13 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5k ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రో మోడల్ 6.83 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేలు 120Hz రీఫ్రెష్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి.

రెనో 13 ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు 8GB LPDDR5X ర్యామ్, గరిష్ఠంగా 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదే ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉన్నాయి.
బేస్ వేరియంట్ OIS ఫీచర్‌తో 50MP LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా సహా 50MP JN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 50MP JNS టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కలిగి ఉంది. మరియు 50MP JN5 సెల్ఫీ కెమెరాను అమర్చారు.
కెమెరా విభాగం పరంగా ఈ సిరీస్ AI రీఇమేజ్, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, AI లైవ్‌ఫోటో, AI క్లారిటీ ఎన్‌హేన్సర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఈ సిరీస్ OPPO X1 సిగ్నల్ బూస్ట్ చిప్‌తో అందుబాటులో ఉంది. ఈ చిప్ కారణంగా వైఫై ట్రాన్సిమిషన్ పవర్ 25 శాతం మెరుగవుతుంది.
ఒప్పో రెనో 13 హ్యాండ్‌సెట్ 80W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో మోడల్ 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ రెండు మోడళ్లు IP66+ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.4, WiFi 6 కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








