మిడ్ రేంజ్‌లో ప్రీమియం డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇవాళ్టి నుంచే OPPO ఫోన్‌ల సేల్
OPPO Reno 14 5G Series Sale : ఒప్పో నుంచి గత వారంలో ఒప్పో రెనో 14, రెనో 14 ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.42999 గా ఉంది. అదే ప్రో మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.49999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.54999 గా ఉంది.

ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్ :
ఒప్పో రెనో 14 5G ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల అమోలెడ్ 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఫారెస్ట్ గ్రీన్, పెర్స్ వైట్ కలర్ వేరియంట్స్ లభిస్తుంది.
ఈ ఒప్పో బేస్ వేరియంట్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OIS), 116 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రావైడ్ లెన్స్ (AF) మరియు 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో కెమెరా (OIS), 50MP శాంసంగ్ JN5 సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ప్రీమియం డిజైన్, గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. పెర్ల్ వైట్, టైటానియం గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఈ ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. AI Unblur, AI Call Assistant, AI Mind Space, AI Recompose వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 80W వైర్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ OV50E ప్రైమరీ కెమెరా (OIS), 50MP OV50D అల్ట్రావైడ్ లెన్స్ మరియు 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో కెమెరా (OIS), 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








