Home
Mobile

ప్రీమియం డిజైన్‌, 6000mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలతో ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

OPPO Reno 14 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి ఇవాళ భారత్‌ మార్కెట్‌లోకి ఒప్పో రెనో 14 సిరీస్‌ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 14 5G, ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్‌లున్నాయి. ఈ రెండు ఫోన్‌లుగా కూడా మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. మరియు ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో ఈ రెండు ఫోన్‌లు చైనాలో లాంచ్‌ అయ్యాయి. ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్‌ 6.59 అంగుళాల అమోలెడ్‌ 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 3840Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

OPPO Reno 14 5G Smartphone launched

ఈ ఫోన్‌ గ్లాస్‌ బ్యాక్‌ మరియు అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్‌, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 116 డిగ్రీల FOV మరియు ఆటోఫోకస్‌ తో 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు OIS, 3.5X ఆప్టికల్ జూమ్‌తో 50MP శాంసంగ్‌ JN5 టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 50MP శాంసంగ్‌ JN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

6000mAh బ్యాటరీ :
ఈ ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 5 సంవత్సరాల వరకు బ్యాటరీ మెరుగైన పనితీరును అందిస్తుందని ఒప్పో చెబుతోంది.

కనెక్టివిటీ పరంగా eSIM, 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఆప్టికల్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

ఒప్పో రెనో 14 5G సిరీస్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.42999 గా ఉంది.

ఈ ఫోన్ ఫారెస్ట్‌ గ్రీన్‌, పెర్స్‌ వైట్ కలర్‌ వేరియంట్స్‌ లభిస్తుంది. ఈ ఫోన్‌ సేల్‌ (OPPO Reno 14 5G sale) జులై 8 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా వైబ్‌సైట్‌, అమెజాన్‌, ఇతర రిటైల్‌ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Reno 14 5G Smartphone launched with mediatek dimensity 8350 Soc Chipset and premium design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X