ఒప్పో నుంచి భారత్ మార్కెట్‌లోకి త్వరలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
OPPO Reno 14 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత్ మార్కెట్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఒప్పో రెనో 14 5G సిరీస్‌లో భాగంగా ఈ రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 14, ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది.
చైనా మార్కెట్లో గత నెలలోనే :
ఈ ఒప్పో సిరీస్ గత నెలలోనే చైనా మార్కెట్‌లో లాంచ్ అయింది. చైనా వేరియంట్స్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చాయి. 50MP కెమెరాలను కలిగి ఉన్నాయి. మరియు ఆండ్రాయిడ్ ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తున్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి.

ఒప్పో రెనో 14 సిరీస్‌ను భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు సంస్థ వెల్లడించినప్పటికీ, కచ్చితంగా ఏ తేదీన లాంచ్ కానుందే వివరాలను ఒప్పో వెల్లడించలేదు. జులై తొలి లేదా రెండో వారంలో ఈ ఒప్పో ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
విడుదల అనంతరం ఈ రెండు వేరియంట్స్ ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రొడక్ట్ పేజీ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌లో ఉంది. భారత్ మార్కెట్‌లో ఒప్పో రెనో 14 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.40,000 గా ఉండే అవకాశం ఉంది. అదే ఒప్పో రెనో 14 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.50,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఒప్పో రెనో 14 :
చైనాలో ఇప్పటికే ఈ ఫోన్ (OPPO Reno 14 Smartphone) అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.59 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Color OS 15 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కాల్స్‌ను కలిగి ఉంది. మరియు 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.

ఒప్పో రెనో 14 ప్రో :
ఈ హ్యాండ్‌సెట్ (OPPO Reno 14 Pro Smartphone) చైనా వేరియంట్ 6.83 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Color OS 15 ను కలిగి ఉంది.
ఈ ప్రో మోడల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ సిరీస్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. మరియు మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం స్టీరియో స్పీకర్లను కలిగి ఉన్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చి ఉంది. ఈ ఫోన్ జులైలో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. కచ్చితమైన విడుదల తేదీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications