Home
Mobile

ఆకట్టుకొనే డిజైన్‌, సూపర్‌ ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత్‌ మార్కెట్‌లో ఒప్పో రెనో 15 సిరీస్‌ ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెనో 15 5G, రెనో 15c 5G, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మిని మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. రెనో 15, రెనో 15c స్మార్ట్‌ఫోన్‌లు డిజైన్, బ్యాటరీ లైఫ్‌పై అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఫోన్‌ల పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ఒప్పో రెనో 15 స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Oppo Reno 15 5G Smartphones) డైనమిక్‌ స్టెల్లర్‌ రింగ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. స్క్వేర్‌ రింగ్‌ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. 6.59 అంగుళాల LTPS అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌, 1200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Oppo Reno 15 5G  Reno 15C Smartphones launched in india

ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్‌ను అందిస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 116 డిగ్రీల 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3.5 జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు.

ఒప్పో రెనో 15 5G స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.

ఒప్పో రెనో 15 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ :
ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.45999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.48999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.53999 గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్ జనవరి 13 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.57 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

భారత్‌ మార్కెట్‌లో ఒప్పో రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్‌ (Oppo Reno 15c 5G Smartphone) సేల్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 15 5G, Reno 15C Smartphones launched in india here are the full specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X