Home
Mobile

200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, IP68 + IP69 రేటింగ్‌తో ఒప్పో ఫోన్‌లు విడుదల..!

ఒప్పో భారత్ మార్కెట్లో ఇవాళ రెనో 15 సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెనో 15 5G, రెనో 15c, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మిని వంటి మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రో మోడల్స్‌ ఏకంగా 200MP కెమెరాను కలిగి ఉన్నాయి. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌ల స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ఒప్పో రెనో 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ (Oppo Reno 15 Pro 5G Smartphone) 6.78 అంగుళాల ఫుల్‌ HD+ LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 450 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

OPPO Reno 15 Pro 5G  Reno 15 Pro Mini Smartphones launched with 200MP Camera in india telugu news

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. Mali G720 GPU తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్), PDAF సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 116 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్‌ లెన్స్‌ మరియు 3.5x ఆప్టికల్‌ జూమ్‌, OIS సపోర్టుతో 50MP శాంసంగ్ JN5 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు 60fps వద్ద 4K HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 80W Supervooc వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

ఒప్పో రెనో 15 ప్రో మిని 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Oppo Reno 15 Pro Mini 5G Smartphone) 6.32 అంగుళాల 1.5k LTPS అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా 7 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. Mali G720 GPU తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్), PDAF సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 116 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్‌ లెన్స్‌ మరియు 3.5x ఆప్టికల్‌ జూమ్‌, OIS సపోర్టుతో 50MP శాంసంగ్ JN5 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు 60fps వద్ద 4K HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ 80W SuperVooc వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ప్రో మోడల్స్‌ కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్‌ 5G, 4G, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చి ఉంది.

ఒప్పో స్మార్ట్‌ఫోన్ల ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో రెనో 15 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.67999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999 గా ఉంది.

మినీ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.64999 గా ఉంది. ఈ రెండు ఫోన్‌ల సేల్‌ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Reno 15 Pro 5G, Reno 15 Pro Mini Smartphones launched with 200MP Camera in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X