Home
Mobile

ఒప్పో రెనో 15 సిరీస్‌ ధర వివరాలు లీక్.. రేపే ఈ సిరీస్‌ విడుదల.. పూర్తి వివరాలు!

Oppo Reno 15 Series : ఒప్పో రెనో 15 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌ లో జనవరి 8 న తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌ లో భాగంగా రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్‌ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ధర వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ ఈ వివరాలను షేర్‌ చేశారు. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

ధర వివరాలు లీక్‌ :
టిప్‌స్టర్‌ షేర్‌ చేసిన వివరాల ఆధారంగా ఒప్పో రెనో 15 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.45999 ఉంటుందని తెలుస్తోంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.48999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.53999 గా ఉండే అవకాశం ఉంది.

Oppo Reno 15 Series price

ఒప్పో రెనో 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.67999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999 గా ఉంటుందని టిప్‌స్టర్‌ తెలిపారు. ప్రో ఫోన్‌ 200MP ప్రైమరీ కెమెరా, 3.5x జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 100 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది

అదే ప్రో మినీ మోడల్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.64,999 గా ఉంటుందని తెలిపారు. ఒప్పో రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్ వివరాలు వెల్లడి కాలేదు. అయితే రూ.40 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ధర వివరాలపై ఒప్పో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ సిరీస్‌ గురించి ఒప్పో అనేక వివరాలు వెల్లడించింది. ఒప్పో ప్రొడక్ట్‌ పేజీ ఆధారంగా ఈ సిరీస్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. గేమింగ్‌ సమయంలో మెరుగైన నెట్‌వర్క్‌ కోసం ఏఐ గేమింగ్‌ యాంటెనా సిస్టమ్‌ యాక్సెలిరేషన్‌ ఫీచర్‌ ను కలిగి ఉంటుంది. విడుదల సమయంలో ఈ సిరీస్‌ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ :
ఒప్పో రెనో 15 సిరీస్‌ లో అందుబాటులోకి రానున్న ఓ మోడల్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి 2.36 రోజులు వినియోగించుకోవచ్చని చెబుతోంది. 1-100 శాతం ఛార్జింగ్‌ను 53 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని ఒప్పో చెబుతోంది.

ఒప్పో రెనో 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 8 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. విడుదల అనంతరం ఒప్పో ఇ-స్టోర్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఇతర భాగస్వామ్య స్టోర్‌లలో సేల్‌ ప్రారంభం కానుంది. రేపు విడుదల సమయంలో ధర, సేల్‌, ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Reno 15 Series price tipped ahead of launch on tomorrow in india, full detail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X