Home
Mobile

200MP కెమెరాతో OPPO స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ సహా కీలక వివరాలు వెల్లడి

OPPO Reno 15 Series : ఒప్పో రెనో 15 సిరీస్‌ విడుదల తేదీ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌ లో భాగంగా మూడు ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ఒప్పో వెల్లడించింది. ఒప్పో రెనో 15 5G, ఒప్పో రెనో 15 ప్రో 5G, ఒప్పో రెనో 15 ప్రో మిని 5G ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్లకు సంబంధించిన అనేక వివరాలు కూడా ఇప్పటికే వెల్లడయ్యాయి. తాజాగా విడుదల తేదీని కూడా ఒప్పో ప్రకటించింది.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఒప్పో రెనో 15 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 8 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానున్నాయి. ఒప్పో రెనో 15 సిరీస్ ఫోన్‌లను ఒప్పో ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్‌ ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌, HoloFusion టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లు IP66, IP68, IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది.

OPPO Reno 15 Series smartphones launch date

200MP కెమెరా :
ఒప్పో రెనో 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 200MP ప్రైమరీ కెమెరా, 3.5x జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 100 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గ్రూప్‌ ఫోటో ప్రాసెసింగ్ ఫీచర్‌, టోన్‌ బ్యాలెన్సింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుందని ఒప్పో తెలిపింది. ఈ రెండు ఫీచర్‌లతో లైటింగ్‌, కలర్‌లను సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉంటుంది.

4K రికార్డింగ్‌ :
ఒప్పో రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మిని 5G స్మార్ట్‌ఫోన్‌ల ప్రైమరీ, అల్ట్రావైడ్‌, టెలిఫోటో కెమెరాలు 60fps వరకు 4K HDR వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలిపింది. దీంతోపాటు OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటాయి.

డ్యూయల్‌ వ్యూ వీడియో రికార్డింగ్‌ ఫీచర్‌ :
ఈ ప్రో మోడల్స్‌ డ్యూయల్‌ వ్యూ వీడియో రికార్డింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి. అదే విధంగా వీడియో రికార్డింగ్‌ సమయంలోనూ ఫోటో తీసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

దీంతోపాటు ఒప్పో రెనో 15 సిరీస్ AI Editor 3.0 టూల్స్‌ను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగా మోషన్‌ ఫోటో ఎడిటింగ్‌, ఏఐ పొర్ట్రియిట్‌ గ్లో ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తక్కువ లైటింగ్‌ ఉన్న సమయాల్లో మెరుగైన డైనమిక్‌ రేంజ్‌ కోసం ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంటుందని ఒప్పో చెబుతోంది.

ఒప్పో రెనో 15 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఒప్పో రెనో 15 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ, 3.5x జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50MP కెమెరాను కలిగి ఉంటుందని ఒప్పో తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Reno 15 Series smartphones launch date revealed in india here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X