50MP + 50MP కెమెరాలు, 6 సంవత్సరాల అప్‌డేట్స్, 7000mAh బ్యాటరీ ఫోన్ ముందస్తు బుకింగ్!
OPPO Reno 15C Smartphone : ఒప్పో సంస్థ భారత్ మార్కెట్ లో గత సంవత్సరం ఒప్పో రెనో 15 సిరీస్ విడుదల అయింది. ఇందులో భాగంగా రెనో 15 5G, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ, రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్ మినహా మిగిలిన మోడల్స్ సేల్ ప్రారంభం అయింది. తాజాగా 15c 5G వేరియంట్ ముందస్తు బుకింగ్ ప్రారంభం అయింది.
ఒప్పో రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్ ను ఒప్పో అధికారిక ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.34999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999 గా ఉంది.

అయితే ఫ్లిప్‌కార్ట్ లో బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3499 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇందులో భాగంగా 6 నెలలపాటు స్క్రీన్ ప్రొటెక్షన్ ను పొందవచ్చు. అదే అమెజాన్ లో SBI క్రెడిట్ కార్డులపై రూ.3800 తక్షణ తగ్గింపును పొందవచ్చు.
ఒప్పో రెనో 15c స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీప్రెష్ రేట్ తో 6.57 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. 10 బిట్ కలర్ అవుట్‌పుట్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్, వెనుక, ముందు వైపు గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సర్ లు ఉన్నాయి. ఈ కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది.
7000mAh బ్యాటరీ :
ఈ రెనో 15c 5G స్మార్ట్‌ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. రివర్స్ వైర్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








