ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్.. కీలక వివరాలు లీక్..?
ఒప్పో రెనో 15 సిరీస్ త్వరలో భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇటీవలే ఈ సిరీస్‌లో భాగంగా విడుదల కానున్న ఫోన్‌లను ఒప్పో వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా ఒప్పో రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మిని ఫోన్‌లు విడుదల కానున్నాయని తెలిపింది. దీంతోపాటు కొన్ని స్పెసిఫికేషన్‌ల వివరాలనూ షేర్ చేసింది. అయితే ఈ సిరీస్ గురించి తాజాగా కీలక వివరాలు లీక్ అయ్యాయి.
తాజా లీక్స్ ఆధారంగా ఒప్పో రెనో 15 సిరీస్ నుంచి మరో ఫోన్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ మూడు ఫోన్‌లతోపాటు ఒప్పో రెనో 15c (OPPO Reno 15C Smartphone) కూడా లాంచ్ కానుందని టిప్‌స్టర్ అంచనా వేస్తున్నారు.

రెనో 15C స్మార్ట్‌ఫోన్ లీక్స్ :
భారత్ మార్కెట్లో ఒప్పో రెనో 15c స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల ఫుల్ HD LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ తో పనిచేస్తుందని అంచనా వేశారు. ఈ చిప్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. ఇందులో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఒప్పో రెనో 15C స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ీ హ్యాండ్‌సెట్ 8.14mm థిక్‌నెస్‌తో 189 గ్రాముల నుంచి 195 గ్రాముల బరువును కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ధర వివరాలు కూడా లీక్! :
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ రూ.40 వేల ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ మోడల్, టిప్‌స్టర్ వెల్లడించిన స్పెసిఫికేషన్‌లపై ఒప్పో ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. త్వరలో ఈ ఫోన్ గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* ఇటీవల టిప్‌స్టర్ పరాస్ గుగ్‌లానీ వెల్లడించిన వివరాల ఆధారంగా ఒప్పో రెనో 15 సిరీస్ భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో జనవరి 8 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెనో 15 ఫోన్ సుమారు రూ.50 వేల ధరలో, అదే రెనో 15 ప్రో మిని ఫోన్ సుమారుగా రూ.40 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.
ఒప్పో రెనో 15 సిరీస్ ఫోన్‌లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. మరియు ఒప్పో Holofusion టెక్నాలజీపై డిజైన్ చేసినట్లు తెలిసింది. రెనో 15 ఫోన్ గ్లేసియర్ వైట్, ట్విలైట్ బ్లూ, అరోరా బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే ప్రో మోడల్ Cocoa బ్రౌన్, సన్‌సెట్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
అదే మిని మోడల్ Cocoa బ్రౌన్, గ్లేసియర్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.32 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే ప్రో మోడల్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, బేస్ వేరియంట్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








