Oppo Reno 3 Pro: 44MP మొదటి సెల్ఫీ కెమెరా ఫోన్ లాంచ్...

|

గత ఏడాది చివర్లో చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 3 ప్రో ఈ రోజు ఇండియాలో లాంచ్ అయింది. రెనో 3 ప్రో యొక్క ట్వీక్డ్ వెర్షన్ అయిన కొత్త ఒప్పో ఫోన్ డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాతో పాటుగా మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఒప్పో రెనో 3 ప్రో
 

ఒప్పో రెనో 3 ప్రో

ఈ స్మార్ట్‌ఫోన్ 108 మెగాపిక్సెల్ ఫోటోలను తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒప్పో రెనో 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 4G స్పెసిఫికేషన్లతో ఇండియాలో లాంచ్ అవుతున్నది. ఇది మీడియాటెక్ హెలియో P95 చిప్‌సెట్‌తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి డివైస్. ఒప్పో నుండి వచ్చిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్ మార్కెట్లో రాబోయే వివో V19 ప్రో మరియు శామ్‌సంగ్ గెలాక్సీ A71 వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనున్నది. రెనో 3 ప్రో 256 GB స్టోరేజ్ సామర్థ్యంను కలిగి ఉండి రూ.29,990 ప్రారంభ ధరతో రెండు వేరియంట్లలో ఇండియాలో విడుదల అయింది.

మొబైల్ టారిఫ్ పెంపు తరువాత లాభపడిన టెల్కో ఎవరు?

ధరల వివరాలు

ధరల వివరాలు

ఒప్పో రెనో 3 ప్రో ప్రస్తుతం ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో 8GB + 128GB వేరియంట్ కోసం రూ.29,990 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.32,990 గా ధరను నిర్ణయించారు. ఇది అరోరా బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Vivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీ

లాంచ్ సేల్స్ ఆఫర్స్

లాంచ్ సేల్స్ ఆఫర్స్

ఒప్పో రెనో 3 ప్రో యొక్క సేల్స్ మార్చి 6, 2020 నుండి అన్ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇది ఈ రోజు నుండి ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. కస్టమర్లను ఆకర్షించడానికి ఒప్పో కొన్ని లాంచ్ ఆఫర్లను కూడా అందిస్తున్నది. వీటిలో ఒప్పో కేర్‌తో ఫుల్ కేర్ ప్రొటెక్షన్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల మీద 10 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదనంగా 1,000 మంది లక్కీ కొనుగోలుదారులకు స్మార్ట్ఫోన్‌తో పాటుగా ఒప్పో ఎన్‌కో ఫ్రీని ఉచితంగా అందిస్తుంది. అలాగే 100 శాతం డేటా ప్రయోజనాలను అందించడానికి కంపెనీ జియోతో జతకట్టింది.

iQOO 3: నెట్‌వర్క్‌ కనెక్టివిటీ,గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌లలో రారాజు

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.4-అంగుళాల ఫుల్ HD + సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. దీని యొక్క డిస్ప్లేలో డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇది 90.5% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఒప్పో రెనో 3 ప్రో సరికొత్త మీడియాటెక్ హెలియో P95 చిప్‌సెట్‌ను కలిగి ఉండి 8GB ర్యామ్ మరియు 128GB/ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో జతచేయబడి వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు.

Tata Sky, Airtel Digital TV ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త ధరలు ఇవే...

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఒప్పో రెనో 3 ప్రో వెనుకవైపు గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లోని కెమెరాల్లో 64MP ప్రైమరీ షూటర్, 13MP టెలిఫోటో లెన్స్, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2 MP మోనో లెన్స్ ఉన్నాయి. ఇందులో గల సాఫ్ట్‌వేర్ ఇంటర్‌పోలేషన్ ఉపయోగించి 108MP చిత్రాలను ఇది డెలివరీ చేయగలదు మరియు ఇది 20x డిజిటల్ జూమ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 44 MP మరియు 2 MP డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా 44MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.

ISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రో

కనెక్టివిటీ

కనెక్టివిటీ

ఒప్పో రెనో 3 ప్రో 8.1mm మందంను కలిగి ఉండి మరియు 175 గ్రాముల బరువుతో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ 4G, VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ OS7 తో రన్ అవుతుంది. ఇది 30W VOOC 4.0 ఛార్జింగ్ సపోర్ట్‌తో 4025mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 20 నిమిషాల్లో 50%, మరియు 56 నిమిషాల్లో 100% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo Reno 3 Pro Launched in India: Price, Specs, Sales Date

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X