Oppo Reno 3 Pro సేల్స్ ప్రారంభం నేడే !!! ఆకాశాన్ని అంటుతున్న ఆఫర్స్...

|

ఇండియాలో ఈ వారం మొదటిలో ఒప్పో సంస్థ లాంచ్ చేసిన ఒప్పో రెనో 3 ప్రో యొక్క మొదటి సేల్స్ ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో యొక్క ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఇప్పటికే చైనాలో మంచి ఊపు మీద ఉన్నాయి.

 ఒప్పో రెనో 3 ప్రో
 

భారతదేశంలో ఒప్పో రెనో 3 ప్రో యొక్క బేస్ మోడల్ ధరను రూ.29,990 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్‌సెట్ అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండదు కానీ ఒప్పో యొక్క ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌

సేల్స్ ఆఫర్స్

సేల్స్ ఆఫర్స్

ఒప్పో రెనో 3 ప్రో యొక్క లాంచ్ కార్యక్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఒప్పో కొన్ని గొప్ప సేల్స్ ఆఫర్లను కూడా వెల్లడించింది. వీటిలో ఒప్పో కేర్‌తో పూర్తి డామేజ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. వీటితో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద 10 శాతం క్యాష్‌బ్యాక్ ను కూడా అందివ్వనున్నది. అదనంగా 1,000 మంది లక్కీ కొనుగోలుదారులు స్మార్ట్ఫోన్‌తో ఉచితంగా ఒప్పో ఎన్‌కో ఫ్రీని పొందుతారు. 100 శాతం డేటా ప్రయోజనాలను అందించడానికి కంపెనీ జియోతో జతకట్టింది. క్రొత్త హ్యాండ్‌సెట్ గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

Coronavirus దెబ్బకు I/O 2020 ఈవెంట్‌ను రద్దు చేసిన గూగుల్

ధరల వివరాలు

ధరల వివరాలు

ఒప్పో రెనో 3 ప్రో ప్రస్తుతం ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో 8GB + 128GB వేరియంట్ కోసం రూ.29,990 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.32,990 గా ధరను నిర్ణయించారు. ఇది అరోరా బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Apple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీ

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.4-అంగుళాల ఫుల్ HD + సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. దీని యొక్క డిస్ప్లేలో డ్యూయల్ పంచ్-హోల్ కటౌట్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇది 90.5% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. ఒప్పో రెనో 3 ప్రో సరికొత్త మీడియాటెక్ హెలియో P95 చిప్‌సెట్‌ను కలిగి ఉండి 8GB ర్యామ్ మరియు 128GB/ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో జతచేయబడి వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు.

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఒప్పో రెనో 3 ప్రో వెనుకవైపు గల క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లోని కెమెరాల్లో 64MP ప్రైమరీ షూటర్, 13MP టెలిఫోటో లెన్స్, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2 MP మోనో లెన్స్ ఉన్నాయి. ఇందులో గల సాఫ్ట్‌వేర్ ఇంటర్‌పోలేషన్ ఉపయోగించి 108MP చిత్రాలను ఇది డెలివరీ చేయగలదు మరియు ఇది 20x డిజిటల్ జూమ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 44 MP మరియు 2 MP డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా 44MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

ఒప్పో రెనో 3 ప్రో 8.1mm మందంను కలిగి ఉండి మరియు 175 గ్రాముల బరువుతో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ 4G, VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ OS7 తో రన్ అవుతుంది. ఇది 30W VOOC 4.0 ఛార్జింగ్ సపోర్ట్‌తో 4025mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 20 నిమిషాల్లో 50%, మరియు 56 నిమిషాల్లో 100% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Oppo Reno 3 Pro Sale Starts Today at 12 PM via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X