త్వ‌ర‌లో భార‌త మార్కెట్లోకి Oppo Reno 8 Pro.. స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు ఇవే..!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ Oppo త్వ‌ర‌లో మ‌రో మొబైల్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేయ‌నుంది. ఇప్ప‌టికే స్వంత దేశం చైనా మార్కెట్ లో Oppo Reno 8 Pro+ పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్స్ ను త్వ‌ర‌లో భార‌త మార్కెట్లో విడుద‌ల చేసేందుకు ఆ సంస్థ స‌న్నాహాలు ముమ్మ‌రం చేస్తోంది. ఇందుకు సంబంధించి కంపెనీ ప్ర‌త్యేకంగా తేదీ అయితే వెల్ల‌డించ‌లేదు.. కానీ, త్వ‌ర‌లోనే ఇవి మ‌న మార్కెట్లోకి వ‌చ్చే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. సంబంధిత టెక్ వ‌ర్గాల నుంచి ఈ కొత్త Oppo Reno 8 Pro కి సంబంధించిన స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్ల స‌మాచారం లీక్ అయింది. కాబ‌ట్టి ఓ సారి వాటికి సంబంధించిన స్పెసిఫికేష‌న్‌ల‌పై ఓ లుక్ వేద్దాం. ఈ మొబైల్‌కు 50 మెగాపిక్సెల్ క్వాలిటీతో వ‌స్తున్న కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువనుంది.

 

Oppo Reno 8 Pro స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి:

Oppo Reno 8 Pro స్పెసిఫికేష‌న్స్, ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి:

Oppo Reno 8 Pro మొబైల్‌ MediaTek Dimensity 8100 (or 8100 Max) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వ‌ర్శ‌న్‌ పై ప‌ని చేస్తుంది. మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. ఈ మొబైల్ Mediatek's Dimensity 8100 మోడ‌ల్ చిప్ సెట్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ర్యామ్ సామ‌ర్థ్యం ఆధారంగా రెండు వేరియంట్ల‌లో రానుంది. వాటిలో 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ఒక వేరియంట్ వ‌స్తుండ‌గా, 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో మ‌రో వేరియంట్ రానుంది. దీనికి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 778జీ ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌ని చేస్తుంది.

కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌..
 

కెమెరా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌..

Oppo Reno 8 Pro మొబైల్ కు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. 50 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో 50MP Sony IMX766 sensor ప్ర‌ధాన కెమెరా ను క‌లిగి ఉంది. అంతేకాకుండా 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మాక్రో షూట‌ర్ లెన్స్ క‌లిగి ఉంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ మొబైల్ 180 గ్రాముల బ‌రువు క‌లిగి ఉంది. ఈ మొబైల్ గీక్‌బెంచ్ ద్వారా బెంచ్‌మార్క్ చేయ‌బ‌డింది.

Oppo Reno 8 Pro ధ‌ర (లీక్ స‌మాచారం):

Oppo Reno 8 Pro ధ‌ర (లీక్ స‌మాచారం):

Oppo Reno 8 Pro మొబైల్‌ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీని క‌లిగి ఉంది. అంతేకాకుండా 4జీ ఎల్‌టీఈ సాంకేతిక‌త‌, డ్యుయ‌ల్ బ్యాండ్‌ వైఫై, యూఎస్‌బీ సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్ క‌లిగి ఉంది. అయితే ఇప్ప‌టికే చైనాలో Oppo Reno 8 Pro+ పేరుతో విడుద‌లైన ఈ వేరియంట్ ధ‌ర రూ.43,000 ఉంది. కాగా ఇది భార‌త్‌లో విడుద‌లైన త‌ర్వాత దీని ధ‌ర రూ.45,000 వ‌ర‌కు ఉండొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాల కోసం వేచి చూడాల్సి ఉంది.

Oppo Pad Air Tablet కూడా త్వ‌ర‌లో రానుంది.

Oppo Pad Air Tablet కూడా త్వ‌ర‌లో రానుంది.

Oppo Reno 8 Pro మొబైల్ తో పాటు త్వ‌ర‌లో Oppo Pad Air Tablet కూడా త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌ లో విడుద‌ల కానుంది. Oppo సంస్థ నుంచి భార‌త మార్కెట్లోకి రానున్న తొలి ట్యాబ్‌లెట్ గా దీన్ని చెబుతున్నారు. ఈ ట్యాబ్‌కు ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ స్టాండ‌ర్డ్స్ ధృవీక‌ర‌ణ చేయ‌డం విశేషం.

Best Mobiles in India

English summary
Oppo Reno 8 Pro Global Model Benchmark Results Out

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X