OPPO Reno13 Pro 5G : గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, కెమెరా అన్ని విభాగాల్లో సత్తాచాటే స్మార్ట్‌ఫోన్

భారత్ మార్కెట్లో OPPO Reno13 Pro 5G ఇటీవల విడుదల అయింది. గత మోడల్‌తో పోలిస్తే ఈ ఫోన్ అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. మెరుగైన పనితీరును అందించేందుకు వీలుగా స్పెసిఫికేషన్‌లు, సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది.
OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 4nm MediaTek Dimensity 8350 SoC
ప్రాసెసర్‌తోపాటు ColorOS 15 తో పనిచేస్తోంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ తోపాటు హ్యాండ్‌సెట్ మెరుగైన బిల్ట్ క్వాలిటీతో అందుబాటులో ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. అయితే ఈ ఫోన్ మిగిలిన ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

చిప్‌సెట్ ఎలాంటి పనితీరును కనబరుస్తుంది..
ఈ 4nm MediaTek Dimensity 8350 SoC చిప్‌సెట్ 4x Cortex A715 తో కూడిన ఆక్టాకోర్ ఫెర్మామెన్స్ కోర్స్ మరియు 4x Cortex A510 ఎఫీషియన్సీ కోర్స్‌ను కలిగి ఉంది. ఇవి 3.35Hz గరిష్ఠ క్లాక్ స్పీడ్‌ను అందిస్తోంది. కంప్యూటింగ్ పవర్ మరియు ఎఫీషియన్సీ కోసం 8 కోర్ CPU ను 6 కోర్ Mail-G615 GPU తో జతచేశారు. NPU 780 చిప్ AI సామర్థ్యాలను అందిస్తోంది. AI బెంచ్‌మార్క్ V5 కు అనుగుణంగా మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది.
ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ పనితీరును అందించేందుకు వీలుగా Reno13 pro 5G హ్యాండ్‌సెట్ కోసం OPPO మరియు MediaTek మెరుగైన చిప్‌సెట్‌ను అందించింది. ఎక్కడా రాజీలేకుండా చిప్‌సెట్‌ను ట్యూన్ చేసింది. ఫలితంగా స్మూత్ మరియు స్టేబుల్ గేమింగ్ ఫర్మామెన్స్‌ను అందిస్తుంది. మెరుగైన పనితీరును అందిస్తూనే 15 శాతం పవర్ వినియోగాన్ని తగ్గించింది. గేమింగ్ సమయంలోనే కాకుండా 4K వీడియో రికార్డింగ్ సమయంలోనూ ఇదే ఫెర్మామెన్స్‌ను కనబరుస్తుంది.

గేమింగ్‌లో నో కాంప్రమైజ్..
OPPO Reno13 Pro 5G ఫోన్ అంటే కేవలం గేమింగ్ కోసమే కాకుండా కెమెరా యూనిట్, వైబ్రంట్ డిస్‌ప్లే, అద్భుతమైన డిజైన్, అవాంతరాలు లేని సాఫ్ట్‌వేర్ వంటివి అనేకం ఉన్నాయి. ఈ చిప్‌సెట్‌తోపాటు అత్యాధునిక కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కన్వెన్షనల్ గ్రాఫైట్ ప్రక్రియతోపాటు పోలిస్తే 70 శాతం మెరుగైన పనితీరును కనబరుస్తుంది.
ఎలాంటి గేమ్స్‌ను అయినా రన్ చేసేందుకు వీలుగా మెరుగైన చిప్‌సెట్, కూలింగ్ సిస్టమ్, 12GB LPDDR5x ర్యామ్ ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ గేమింగ్ సెషన్స్‌లోనూ ఎలాంటి అవాంతరాలు లేని గేమింగ్ కోసం AI హైపర్‌బూస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. వర్క్‌లోడ్ లోనూ మెరుగైన పనితీరు కోసం అడ్వాన్స్‌డ్ AI అడాప్టివ్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ అల్గారిథమ్‌ను కలిగి ఉంది.
OPPO Reno13 Pro 5G తో సూపర్ 60 FPS వద్ద బ్యాంగ్ బ్యాంగ్ యాక్షన్ ను 8 గంటల వరకు ఆస్వాదించవచ్చు. మరియు స్మూత్ ఫెర్మామెన్స్‌ను అందిస్తుంది. X యాక్సిస్ లీనియర్ మోటార్, O హ్యాప్టిక్స్ టెక్నాలజీ కచ్చితమైన, రియల్‌టైం టచ్ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది.
OPPO Reno13 Pro 5G ఫోన్ సిగ్నల్ బూస్ట్ చిప్ X1 ను కలిగి ఉంటుంది. సిగ్నల్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి అన్ని ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. డ్యూయల్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మీడియాటెక్ చిప్ గేమింగ్ కోసం మరియు X1 చిప్ నెట్‌వర్క్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఎటువంటి ల్యాగ్ లేకుండా గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ లో ఫ్రీక్వెన్సీ యాంటీనా కనెక్టివిటీని స్టిరంగా ఉండేలా చూస్తుంది. స్మూత్, ల్యాగ్ ప్రీ గేమింగ్ కోసం AI లింక్‌బూస్ట్ 2.0 మరియు గేమింగ్ ఎక్లూజివ్ యాంటీనా పనిచేస్తుంది. ఈ ఫోన్ TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఓవర్ హీటింగ్ సమస్య లేకుండా ఉండేలా ఈ ఫోన్ S రేటింగ్ TUV SUD చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
Ideas, refined. Thoughts, summarized. AI Writer and AI Summary in #OPPOReno13Series make productivity seamless. #LiveInTheMoment #OPPOAIPhone
— OPPO India (@OPPOIndia) January 8, 2025
Know more: https://t.co/CQ6etIjwEx pic.twitter.com/UC31vuOlqS
స్మార్ట్ AI ప్రొడక్టివిటీ
OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ స్మూత్, పర్సనలైజ్డ్ పనితీరును కనబరుస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS Skin తో పనిచేస్తుంది. AI ప్రొడక్టివిటీ ఫీచర్‌లతో కూడిన అనేక కస్టమైజేషన్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లతోపాటు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని ఒప్పో చెబుతోంది.
ఐదు సంవత్సరాలపాటు రోజువారీ వినియోగించినా పనితీరులో మార్పులు వచ్చే అవకాశం లేదు. స్మూత్, నమ్మకమైన పనితీరునే అందిస్తుంది. ColorOS 15 అనేక స్మాఫ్ట్‌వేర్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ట్యాబ్ టూ షేర్, స్క్రీన్ ట్రాన్సిలేటర్ సహా మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
Tap to Share : ఈ ఫీచర్ కారణంగా థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే ఐఫోన్ యూజర్లకు ఈ Reno13 pro 5G స్మార్ట్‌ఫోన్ నుంచి AI లైవ్ ఫోటో షేరింగ్ కు అవకాశం ఉంటుంది.
Screen Translator : ఈ ఫీచర్ మల్టీలాంగ్వేజ్ నిపుణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైన టెక్ట్స్‌ను ట్రాన్సిలేట్ చేసేందుకు సాయం చేస్తుంది. ఫలితంగా ఇతర భాషల్లో సంభాషించేందుకు అనువుగా మారుస్తుంది.
AI ప్రొడక్టివిటీ ఫీచర్‌లు :
* AI Summary పెద్ద టెక్ట్స్ మెసేజ్‌లు లేదా ఇ-మెయిల్స్‌ను సులభంగా అర్ధమయ్యే విధంగా మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది.
* AI Reply అవసరం అయిన చోట సులభంగా సమాధానాలను రూపొందించగలదు. దీంతోపాటు అప్పటికే రాసిన సందేశాలను మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో సోషల్ మీడియా పోస్టింగ్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
* AI Speak మీ కోసం వెబ్‌పేజీలను చదవగలదు. మీరు ఎంత పనిలో ఉన్నా.. తాజా వార్తలు తెలుసుకొనేందుకు వీలు కల్పిస్తుంది.
* ColorOS 15 ద్వారా నోట్స్ యాప్, డాక్యుమెంట్ యాప్ కు AI ఫీచర్‌లను అందించింది. ఈ రెండు యాప్‌లు కంటెంట్‌ను సమ్మరైజ్ చేయడం, రీరైట్ చేయవచ్చు. ఈ డాక్యుమెంట్ యాప్ ద్వారా టెక్ట్స్ డాక్యుమెంట్‌లు, ప్రజంటేషన్‌లను ప్రాసెస్ చేయవచ్చు.
OPPO Reno13 Pro 5G సర్కిల్ టూ సెర్చ్ తో కూడిన గూగుల్ జెమిని ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటుంది.
జెమిని అనేక పనులను సులభతరం చేస్తుంది. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సహా మరిన్ని టాస్క్‌లను పూర్తి చేస్తుంది. జెమిని.. గూగుల్ యాప్స్‌లు, ఇతర సర్వీసులతో ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. అనేక టాస్క్‌ల కోసం గూగుల్ డేటా బేస్‌ను ఉపయోగించుకుంటుంది.
సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ మీ సెర్చ్‌ను మరింత సులభతరం చేస్తుంది. ఏదైనా ఇమేజ్ లేదా టెక్ట్స్ ను వృత్తాకారంలో గీత గీయడం ద్వారా కూడా సెర్చ్‌ను ప్రారంభించవచ్చు. దీంతోపాటు ట్యాప్, హైలెట్, స్క్రబ్బింగ్ చేసి కూడా సమాచారాన్ని పొందవచ్చు.

మన్నికకు చిరునామా
పనితీరు సహా సాఫ్ట్‌వేర్‌తోపాటు ఈ OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7i రక్షణను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్యాక్ ప్యానల్ కూడా అదనపు లేయర్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా త్వరగా డ్యామేజీ కాకుండా ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన తొలి ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఆర్మర్ బాడీని కలిగి ఉంటుంది. దీంతోపాటు IP67, IP68, IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా 2 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఈ ఫోన్‌ను ఉంచినా ఎటువంటి డ్యామేజీ అయ్యే అవకాశం లేదు.
ఫ్లాగ్‌షిప్ బిల్ట్ క్వాలిటీతోపాటు ఈ OPPO Reno13 Pro 5G హ్యాండ్‌సెట్ డిజైన్‌లోనూ ఎక్కడా రాజీపడలేదు. 7.55mm థిక్‌నెస్‌తో కూడిన స్లీక్ డిజైన్‌తో కేవలం 195 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. గ్రాఫైట్ గ్రే మరియు మిస్ట్ లావెండర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

అల్టిమేట్ ఫోటోగ్రఫీ మరియు ఎంటర్‌టైన్‌మెంట్
OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ f/1.88 అపేచర్, OIS, 1/1.56 తో కూడిన 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 3.5X ఆప్టికల్ జూమ్, 120X డిజిటల్ జూమ్, OIS తో కూడిన 50MP శాంసంగ్ JN5 టెలిఫోటో లెన్స్ మరియు 115 డిగ్రీల ఫీల్డ్ వ్యూ, ఆటోఫోకస్‌తో 8MP OVo8D అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. f/2.0 అపేచర్, ఆటోఫోకస్‌తో 50MP JN5 సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా విభాగం AI ఫీచర్‌లతోపాటు సాఫ్ట్‌వేర్ అల్గారిథంను సపోర్టును కలిగి ఉంది.
ఈ ఫోన్ కట్టింగ్ ఎడ్జ్ AI ఫీచర్‌లతో కూడిన మెరుగైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. 2K నాణ్యతతో AI Livephoto క్యాప్చర్ ఎంతో మెరుగైన అనుభూతిని అందిస్తుంది. 10X జూమ్ వరకు కూడా షార్ప్ మరియు ప్రొఫెషనల్ లెవల్ ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. AI Reflection Remover ఫీచర్ అవసరం లేని వాటిని తొలగిస్తుంది.
అండర్ వాటర్‌లో కూడా అత్యంత నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా అండర్ వాటర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. AI Studio లోని AI Magic ద్వారా వింటేజ్, Sci-fi, ఫేంటసీ మూమెంట్స్‌ను క్రియేట్ చేయవవచ్చు. ఏ వాతావరణంలో అయినా AI Night Portrait, AI Unblur, AI Clear Face తో వైబ్రంట్, నాయిస్ ఫ్రీ ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. AI Eraser 2.0 తో ఫోటోల్లోని అవసరం లేని ప్రజలు ఇతర వస్తువులను తొలగించవచ్చు. AI Best Face ద్వారా ప్రతి ఫోటోను అత్యంత కచ్చితంగా ఉండేలా క్రియేట్ చేయవచ్చు.
ఈ OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz Smart Adaptive Screen ను కలిగి ఉంది. టాస్క్‌లకు అనుగుణంగా 60Hz, 90Hz, 120Hz రీఫ్రెష్ రేట్‌ను పొందుతుంది. ఈ డిస్‌ప్లే లోబ్లూ లైట్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. మరియు HDR ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదా గేమింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
దీంతోపాటు ఈ OPPO Reno13 Pro 5G ఫోన్ 5800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఒకటిన్నర రోజు వరకు వినియోగించుకోవచ్చు. 80W SupervoocTM ఫ్లాష్ ఛార్జ్ సపోర్టును కలిగి ఉంది. కేవలం 48 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చేయవచ్చు. ఐదు సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ పనితీరును కనబరుస్తుంది.

బెంచ్‌మార్క్ ఫోన్..
Reno13 pro 5G హ్యాండ్‌సెట్ మెరుగైన ఫోన్‌గా నిలుస్తుంది. 50k సెగ్మెంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌తో శక్తివంతమైన హ్యాండ్‌సెట్‌గా నిలిచింది. 2025 సంవత్సరంలో అత్యుత్తమ మరియు స్థిరమైన పనితీరును అందించేందుకు వీలుగా లాంచ్ చేయబడింది.
ల్యాగ్ ప్రీ గేమింగ్ గేమింగ్, ఎటువంటి అవాంతరాలు లేని సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్‌డ్ AI ప్రొడక్టివిటీ ఫీచర్‌లును కలిగి ఉంది. ఎక్కువ కాలం మన్నిక, నాణ్యమైన కెమెరాలతో OPPO Reno13 Pro 5G బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో అన్ని రకాల ఫీచర్‌లు, సామర్థ్యాలను కావాలని కోరుకొనే వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఒప్పో రెనో 13 ప్రో 5G ధర మరియు ఆఫర్‌లు
OPPO Reno13 Pro 5G ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌లను వరుసగా రూ.44999, రూ.49999 కే సొంతం చేసుకోవచ్చు. ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర ప్రముఖ అవుట్‌లెట్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. #LiveInTheMoment


Click it and Unblock the Notifications








