Home
Mobile

OPPO Reno13 Pro 5G : AI ఫీచర్‌లతో రోజువారీ ప్రొడక్టివిటీని మెరుగుపరిచే స్మార్ట్‌ఫోన్‌

OPPO Reno13 Pro 5G phone

స్మార్ట్‌ఫోన్ మన దినచర్యలో ఓ భాగంగా మారిపోయింది. అయినా కొత్త ఫోన్‌లు కొనుగోలు చేస్తున్న సమయంలో హ్యాండ్‌సెట్‌ ప్రొడక్టివిటీని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌తో మీ అవసరాలు అన్నింటికి తగిన హ్యాండ్‌సెట్‌ దొరికిందనే భావన కలుగుతుంది.

స్మార్ట్‌ AI ఫీచర్‌లు, స్మూత్‌ పెర్ఫామెన్స్‌, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌, సూపర్‌ డిజైన్‌ను ఈ ఫోన్‌ కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ X1 చిప్‌సెట్‌ను అమర్చి ఉంది. ఫలితంగా స్మూత్‌, ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ అనుభూతి సొంతమవుతుంది. మరియు రోజంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. వీటితోపాటు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, అద్భుతమైన డిస్‌ప్లే సహా స్మార్ట్‌ ఫీచర్‌ల వంటి కారణాలతో OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ రోజువారీ అవసరాలు తీర్చగలిగిన డివైజ్‌గా నిలుస్తుంది.

OPPO Reno13 Pro 5G phone

స్మార్ట్‌ ప్రొడక్టివిటీ
అడ్వాన్స్‌డ్‌ AI ఫీచర్‌ల కారణంగా Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన పనితీరును కలిగి ఉంది. ఈ ఫీచర్‌లు క్లిష్టమైన మరియు ఇతర టాస్క్‌లను కూడా సులభంగా చేసేందుకు వీలు కల్పిస్తాయి.

ఉదాహరణకు మీకు ఓ సుదీర్ఘమైన మెయిల్ వచ్చిందనుకోండి. అందులోని ప్రతి వాక్యం చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. AI Summary ఫీచర్‌తో మొత్తం సారాంశాన్ని తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీకు వచ్చిన మెసేజ్‌లను చదివి, సులభంగా అర్ధమయ్యే విధంగా వివరిస్తుంది. ఫలితంగా సమయం కలిసివస్తుంది.

మీకు తక్కువ సమయం ఉన్నప్పుడు మరియు కొన్ని మెసేజ్‌లకు కచ్చితమైన స్పందన తెలియజేయాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో AI Reply ఫీచర్‌ మీకు అండగా నిలుస్తుంది. సందర్భానికి అనుగుణంగా రెస్పాన్స్‌ ఇస్తుంది.

మీరు ఒక ముఖ్యమైన ఇమెయిల్‌ పంపుతున్నా లేదా సోషల్ మీడియా కోసం కంటెంట్‌ రూపొందిస్తున్నా AI Writer ఫీచర్‌ మీకు అండగా నిలుస్తుంది. మీరు సమర్థవంతంగా, ప్రభావవంతంగా కంటెంట్‌ రూపొందించేలా చూస్తుంది.

మల్టీటాస్కింగ్‌ చేసే వారికి ఈ ఫీచర్‌ ఎంతో సాయం చేస్తుంది. మీరు ఒక టాస్క్‌లో బిజీగా ఉన్నారనుకోండి. అయినా తాజా వార్తలకు సంబంధించిన వివరాలు మీరు తెలిసేలా AI Speak ఫీచర్‌ మీకోసం పనిచేస్తుంది. అంటే వెబ్‌పేజీని చదువుతుంది. ఫలితంగా రెండు పనులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.

ముఖ్యమైన సమావేశాల సమయంలో అన్ని అంశాలను నోట్‌ చేసుకోవడం కష్టమైన పని. అయితే ColorOS 15 తో అందుబాటులోకి వచ్చిన Notes App మీకు ఎడిటర్‌ తరహాలో సాయం చేస్తుంది. సమావేశంలోని అంశాలను సేకరిస్తుంది, వాక్యాలు అర్థవంతంగా ఉండేలా చూస్తుంది.

ప్రస్తుతం రోజువారీ అనేక డాక్యుమెంట్‌లు అవసరం అవుతాయి. అయితే అన్నింటినీ సక్రమంగా దాచుకొనేందుకు అవకాశం లేకపోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత Documents App మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను సరైన క్రమంలో ఉంచుతుంది. మీ పనిభారాన్ని తగ్గిస్తుంది.

AI అసెస్టెంట్‌ Gemini మీకు కావాల్సిన సమాధానాలను సులభంగా లభించేలా చూస్తుంది. తక్కువ సమయంలో మెరుగైన సమాచారం లభించేలా సాయం చేస్తుంది. గూగుల్‌ డేటాబేస్‌ ఆధారంగా మీకు సమాచారం అందిస్తుంది. గూగుల్‌ యాప్స్‌తో ఇంటిగ్రేడ్‌ చేసి ఉన్న ఈ ఏఐ అసిస్టెంట్‌.. మీరు సమర్థవంతంగా టాస్క్‌లను పూర్తిచేసేందుకు సాయం చేస్తుంది.

దీంతోపాటు Circle to Search ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు కనీసం అవగాహన లేని పదాలు లేదా ఇమేజ్ కనిపించింది అనుకోండి.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. వాటిని సర్కిల్‌ చేయడం లేదా హైలెట్‌ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అంశాలకు సంబంధించిన సమాచారం కోసం ఈ ఫీచర్‌లు ఎంతో సాయం చేస్తాయి. మరియు టాస్క్ సులభంగా, తక్కువ సమయంలో పూర్తయ్యేలా చూస్తాయి.

OPPO Reno13 Pro 5G phone

మరింత మెరుగైన పనితీరు కోసం ColorOS 15
OPPO ColorOS 15 ప్రొడక్టివిటీ ఫీచర్‌లు మరియు కస్టమైజేషన్‌ ఆప్షన్‌లతో కూడిన మెరుగైన సాఫ్ట్‌వేర్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుందని OPPO తెలిపింది.

దీంతోపాటు ColorOS 15 మరో అద్భుతమైన ఫీచర్‌ను కలిగి ఉంది. Tap to Share ఫీచర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్‌లు ఫోటోలు, ఇతర ఫైల్స్‌ను iOS యూజర్‌లకు సులభంగా షేర్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి OPPO Reno 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే LivePhoto మరియు ఐఫోన్‌లకు డాక్యుమెంట్‌ షేరింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తోంది.

ColorOS 15 అనేక ప్రొడక్టివిటీ ఫీచర్‌లు, AI ఎన్‌హేన్స్‌మెంట్స్‌, నేచురల్‌ డిజైన్‌, మరియు ఆప్టిమైజేషన్ వంటి ఆప్షన్‌లను కలిగి ఉంది. ఫలితంగా రోజువారీ అవసరాలు తీర్చడం సహా వినియోగదారుడి మెరుగైన స్మార్ట్‌ఫోన్‌ అనుభూతిని అందిస్తాయి.

OPPO Reno13 Pro 5G phone

సమర్థవంతమైన పనితీరు సహా..
OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm MediaTek Dimensity 8350 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ CPU తో మల్సీ టాస్కింగ్‌ పనితీరును కనబరుస్తుంది. 4 Cortex A715 ఫెర్మామెన్స్‌ కోర్స్‌ మరియు 4 Cortex A510 ఎఫీషియన్సీ కోర్స్‌, గరిష్ఠంగా 3-35GHZ ను కలిగి ఉంది. పెద్ద టాస్క్‌ల సమయంలోనూ ఈ ఫోన్‌ స్మూత్‌ పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. దీంతోపాటు 6 కోర్ Mali-G615 GPU ను కలిగి ఉంది.

ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ కోసం ఈ ఫోన్ OPPO సొంతంగా అభివృద్ధి చేసిన సిగ్నల్‌బూస్ట్‌ X1 చిప్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ సిగ్నల్‌ స్థిరంగా ఉండేలా చూస్తుంది. MediaTek 8350 చిప్‌సెట్‌, X1 చిప్‌సెట్‌లతో ఈ ఫోన్‌ ట్రూ ట్యాగ్‌ ఫ్రీ కిల్లర్‌గా నిలుస్తుంది.

ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 3,1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఫలితంగా Reno13 pro 5G ఫోన్‌ మెరుగైన పనితీరును అందిస్తుంది. AI హైపర్‌బూస్ట్ టెక్నాలజీ గేమ్‌ప్లే, ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తుంది. మరియు హై ఫ్రేమ్‌ రేట్‌ కొనసాగేలా చూస్తుంది.

థర్మల్‌ కండక్టివ్‌ గ్రాఫైట్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ కూలింగ్‌ సిస్టమ్‌ ఉష్ణోగ్రత ను సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది. ఎక్కువ గంటల వినియోగంలోనూ ఫోన్‌ మెరుగైన పనితీరును అందించేలా సాయం చేస్తుంది. NPU 780 జనరేటివ్‌ AI ఇంజిన్‌ ఓవరాల్‌ పనితీరు మెరుగుపడేలా చూస్తుంది.

Reno13 Pro 5G హ్యాండ్‌సెట్‌లో TUV Rheinland హై నెట్‌వర్క్ పెర్ఫామెన్స్‌ను సర్టిఫికేషన్‌ మరియు S రేటింగ్‌తో కూడిన TUV SUD ల్యాగ్‌ ఫ్రీ మొబైల్ గేమింగ్ అత్యున్నత పనీతీరు కనబరిచేలా చూస్తుంది. గేమింగ్‌, 4K వీడియో రికార్డింగ్ వంటి మల్టీ టాస్కింగ్ సమయాల్లో యూజర్లకు మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

OPPO Reno13 Pro 5G phone

ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా..
ఆకట్టుకొనే పనితీరు, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాలతోపాటు Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే, బ్యాక్‌ ప్యానల్‌ కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 7i రక్షణను కలిగి ఉంది. ఫలితంగా పొరపాటున జారిపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఈ Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ తో కూడిన సెగ్మెంట్‌లోనే తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

అడ్వాన్సడ్‌ స్పాంజ్‌ బయోనిక్‌ కుషనింగ్‌తో కూడిన ఆల్‌రౌండ్‌ ఆర్మర్‌ బాడీ మరింత మెరుగైన రక్షణ అందిస్తుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ IP66, IP68 మరియు IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు స్ప్లాష్‌ రెసిస్టెంట్‌గా Reno13 Pro 5G ఫోన్‌ ఉంది. ఫలితంగా 30 నిమిషాల వరకు 2 మీటర్ల నీటి లోతులోనూ ఈ ఫోన్‌ డ్యామేజీ కాదు. దీంతోపాటు 80 డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కూడా హైప్రెజర్‌ వాటర్‌ జెట్స్‌ను కూడా తట్టుకుంటుంది. వీటితోపాటు ఈ Reno13 Pro 5G హ్యాండ్‌సెట్‌ రగ్గడ్‌ బిల్ట్ తోపాటు స్లీక్‌, స్టైలిష్‌ డిజైన్‌ను కలిగి ఉంది. మిస్ట్‌ లావెండర్‌ మరియు గ్రాఫైట్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది.

OPPO Reno13 Pro 5G phone

అద్భుతమైన కెమెరా సామర్థ్యాలు :
ప్రొడక్టివిటీ మరియు మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలతోపాటు Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫొటోగ్రఫీని అందిస్తుంది. f/1.88 అపేచర్‌, OIS, 1/1.56 తో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 120X డిజిటల్‌ జూమ్, 3.5x ఆప్టికల్‌ జూమ్‌, OIS తో 50MP శాంసంగ్‌ JN5 టెలిఫొటో లెన్స్‌ మరియు ఆటోఫోకస్‌, 115 ఫీల్డ్ వ్యూతో కూడిన 8MP OVo8D అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు f/2.0 అపేచర్‌, ఆటోఫోకస్‌తో 50MP JN5 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా విభాగం OPPO సాఫ్ట్‌వేర్‌ సహా AI ఫీచర్లను సపోర్టు చేస్తుంది.

AI Clarity Enhancer ఫీచర్‌ 10x జూమ్‌ వద్ద కూడా స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్‌ చేస్తుంది. అదే AI Reflection ఫీచర్‌ అవసరం లేని గ్లాస్ రిఫ్లక్షన్‌లను తొలగిస్తుంది. అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ ఫీచర్‌తో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు. AI Studio లోని AI Magic ఫీచర్‌ ద్వారా వింటేజ్‌, Sci-fi, ఫ్యాంటసీ వంటి యూనిక్‌ పొర్ట్రెయిట్స్‌ను షూట్ చేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా AI Night Portrait, AI Unblur, AI Clear Face, AI Eraser 2.0, AI Best Face వంటి ఫీచర్‌లతో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు.

OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 5800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఒకటిన్నర రోజు వరకు వినియోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ 80W SUPERVOOCTM ఫ్లాష్‌ ఛార్జ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 48 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్‌ చేయవచ్చు. 5 సంవత్సరాల వరకు బ్యాటరీ మెరుగైన పనితీరును అందిస్తుందని ఒప్పో చెబుతోంది. చివరి సెక్యూరిటీ అప్‌డేట్‌ అనంతరం కూడా స్మూత్‌ పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది.

OPPO Reno13 Pro 5G phone

Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌లో 6.83 అంగుళాల 1.5K రిజల్యూషన్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Smart Adaptive Refresh రేట్‌ను కలిగి ఉంటుంది. కంటెంట్ ఆధారంగా 60Hz, 90Hz, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు లోబ్లూ లైట్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. HDR సపోర్టును కలిగి ఉంటుంది.

OPPO Reno13 Pro 5G phone

అన్నింటా బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌..
OPPO Reno13 Pro 5G బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలు, అద్భుతమైన పనితీరు, ప్రొడక్టివిటీ ఫీచర్‌లతో బెస్ట్‌ హ్యాండ్‌సెట్‌గా నిలుస్తుంది. ColorOS 15 తో AI Summary, AI Reply, AI Writer వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

దీంతోపాటు శక్తివంతమైన 4nm MediaTek Dimensity 8350 చిప్‌సెట్‌తో ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ మరియు స్మూత్‌ మల్టీ టాస్కింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా డిజైన్ను కలిగి ఉంది. ఏరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియం ఫ్రేమ్‌ మరియు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 7i రక్షణను కలిగి ఉంది. రోజువారీ టాస్క్‌లు సహా ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్‌గా నిలుస్తుంది.

OPPO Reno13 Pro 5G phone

ధర, ఆఫర్లు, సేల్‌ వివరాలు :
OPPO Reno13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా ఉంటుంది. ప్రారంభ సేల్‌ ఆఫర్లతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.44999, రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు. OPPO Reno13 Pro 5G ఫోన్‌ను Flipkart, OPPO E-store సహా ఇతర ప్రధాన రిటైల్‌ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేయవచ్చు. #LiveInTheMoment

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Reno13 Pro 5G Enhancing Everyday Productivity Through the Power of AI
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X