OPPO Reno14 5G : బెస్ట్ కెమెరా ఫీచర్లు, AI ఎడిటింగ్ టూల్స్, ప్రీమియం డిజైన్‌తో అరుదైన స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు రూ.40 వేల లోపు హ్యాండ్‌సెట్‌లలో చాలా వరకు సురక్షితమైన ఫార్మూలాను అనుసరిస్తాయి. అంటే పనితీరు, ఆకట్టుకొనే డిజైన్, కెమెరాల పరంగా కొన్ని జాగ్తత్తలు తీసుకుంటాయి.
అయితే OPPO Reno14 5G ఆ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఈ ఫోన్ మంచిదే అనే పేరు తెచ్చుకొనేందుకే పరిమితం కాకుండా ప్రతిరోజు మెరుగైన అనుభూతిని అందించే విధంగా దృష్టిపెట్టింది. అండర్ వాటర్ షూటింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ సహా టెలిఫోటో లెన్స్ వరకు అనేక ఆశ్చర్యపరిచే ఫీజర్లను జోడించింది.

ప్రాక్టికల్‌గా ఉపయోగించుకొనేలా పొర్ట్రెయిట్ లెన్స్
Reno14 5G స్మార్ట్‌ఫోన్ 3.5x జూమ్, 80mm ఫోకల్ లెన్త్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఇది సాధారణంగా ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కోసం ఉపయోగించే రకం. ఇది డిజిటల్ ట్రిక్ కాదు.. ప్రాక్టికల్‌గా ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ సహజంగా కనిపిస్తుంది. సినిమాటిక్ డెప్త్‌ను అందిస్తాయి. సాధారణంగా మిడ్ రేంజ్ ఫోన్‌లు ఇలాంటి ఫీచర్లను కలిగి ఉండవు.

అదే సమయంలో Reno14 pro 5G స్మార్ట్‌ఫోన్ హైపర్‌టోన్ 50MP క్వాడ్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. అదే బేస్ వేరియంట్ హైపర్‌టోన్ 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు డివైజ్‌లు OPPO తొలి ట్రిపుల్ AI ఫ్లాష్‌లైట్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో ప్రతి లెన్స్ ప్రత్యేకమైన ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ, అల్ట్రావైడ్ లెన్స్‌ల కోసం రెండు ఫ్లాష్‌లతోపాటు టెలిఫోటో లెన్స్ కోసం యూనిక్ ఫ్లాష్ ను కలిగి ఉంది. ఫలితంగా తక్కువ లైట్‌లోనూ ఆకట్టుకొనేలా క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

కంటెంట్ క్రియేషన్ కోసం
Reno14 5G మోడల్ కంటెంట్ క్రియేటింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాలు 60fps వద్ద 4k వీడియో రికార్టింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ముందు కెమెరా కూడా ఇదే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇదే రేంజ్‌లో అందుబాటులోకి వస్తున్న ఇతర మోడల్స్ రిజల్యూషన్ లేదా ఫ్రేమ్ రేట్‌లో రాజీపడతాయి. క్వాలిటీలో ఎటువంటి రాజీలేకుండా అన్ని కెమెరా లెన్స్‌ల మధ్య సజావుగా మారవచ్చు.

ఈ ఫోన్‌లో ఆడియో విభాగానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఫోన్ OPPO AI వాయిస్ ఎన్‌హేన్స్‌ర్ ఫీచర్ వాయిస్‌లోని అనవసర శబ్దాలను వేరుచేస్తాయి. ఈ ఫీచర్ ముఖ్యంగా మార్కెట్స్, ఎయిర్‌పోర్టులు, కేఫ్‌లు వంటి బహిరంగ ప్రాంతాల్లో రికార్టింగ్ చేసే సమయాల్లో మీకు నిజంగా ఉపయోగపడుతుంది. అల్ట్రా స్మూత్ వీడియో స్టెబిజైలేషన్ మరియు ఆటోఫోకస్ సామర్థ్యాలు కచ్చితంగా ఆకట్టుకుంటాయి.
AI ఎడిటింగ్ ఫీచర్లు
OPPP AI Editor 2.0 ఫీచర్ చాలా ఆకట్టుకొనేలా పనిచేస్తుంది. మీ ఫోటోకు అవసరం అయినంత మేరకు ఎడిటింగ్ చేసుకొనేలా ఉపయోగపడుతుంది. గ్లాస్ రిఫ్లక్షన్‌ను తొలగించవచ్చు. బ్యాగ్రౌండ్‌లో అవసరం లేని వ్యక్తులను తొలగించవచ్చు. ఆఫ్ యాంగిల్ ఫోటోలను కంపోజ్ చేయవచ్చు.

దీంతోపాటు AI Best Face ఫీచర్ పనితీరు కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గ్రూప్ ఫోటోలో ఎవరైనా కంటి రెప్పలు మూసి ఉంచితే ఈ ఫీచర్, ఇతర ఫోటోల నుంచి రిఫరెన్స్ తీసుకొని ముఖాలను మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా సులభంగానే మార్పులు చేసుకొనేందుకు మీకు అనుమతిస్తుంది.
ఎటువంటి కేస్ లేకుండానే అండర్ వాటర్ షూటింగ్
రెనో14 5G స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. వాటర్, పీడనం, దూళిని తట్టుకోగలదు. దీంతోపాటు అండర్ వాటర్ ఫొటోగ్రఫీ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఎటువంటి ప్రత్యేకమైన కేస్ లేకుండానే నీటిలో ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు.

స్విమ్మింగ్ పూల్‌లో మేము ప్రత్యేకంగా పరీక్షించాము. ఈ ఫోన్ ద్వారా 4K వీడియోనూ రికార్డు చేశాము. ఫోన్ తడిగా ఉన్నప్పుడు కూడా మెరుగైన టచ్ రెస్పాన్స్‌ను అందించింది. అండర్ వాటర్‌లో కంటెంట్ క్రియేటింగ్ కోసం ఉపయోగించదగిన ఫోన్‌లో ఒకటిగా నిలిచింది.
ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరమైన పనితీరు
ఈ రెనో14 5G స్మార్ట్‌ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. మెరుగైన పనితీరును కనబరుస్తుంది. హేవీ కెమెరా వర్క్, మల్టీ టాస్కింగ్, ఎక్కువ సమయం వీడియో ఎడిటింగ్ వంటి సందర్భాల్లో ఆకట్టుకొనే పనితీరును అందించింది.

ఇందులో ఉన్న AI NPU 780 కూడా మెరుగైన పనితీరుకు కారణం. రియల్‌టైం ట్రాన్స్‌క్రిప్షన్ నుంచి ట్రాన్స్‌లేషన్ వరకు మరియు వీడియో ఎడిటింగ్‌లో బ్యాగ్రౌండ్ ప్రొసెసింగ్ వరకు సౌకర్యవంతంగా పనిచేస్తుంది. ColorOS కూడా జెమినితో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. అంటే నోట్స్‌ను తీసుకొనేందుకు, కంటెంట్ సారాంశాన్ని క్రియేట్ చేసేందుకు వాయిస్ కమాండ్స్‌ను ఉపయోగించవచ్చు. ఫలితంగా పనిని వేగంగా పూర్తి చేయవచ్చు.
రెండు రోజుల బ్యాటరీ లైఫ్
ఈ ఫోన్ 6000mAH బ్యాటరీని కలిగి ఉంది. సాధారణ వినియోగదారులకు రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. హెవీ యూజర్లకు 7 గంటల స్క్రీన్ టైంను అందిస్తుంది. OPPP 80W SUPERVOOC ఛార్జర్ ద్వారా కేవలం 50 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో రోజంతా సాధారణ వినియోగానికి సరిపోతుంది.

ప్రయాణాలు లేదా ఇతర సమయాల్లో పవర్ బ్యాంక్‌లు తీసుకెళ్లే అవసరం లేకుండా లేదా ఛార్జింగ్ కోసం ఇతర ప్రాంతాల్లో వెతకాల్సిన అవసరం ఉండదు.
రియల్ కంఫర్ట్ అందించేలా డిస్‌ప్లే
రెనో14 5G స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్, వీడియో ప్లేబ్యాక్ సమయంలో స్మూత్ పనితీరును అందిస్తుంది.

ఈ ఫోన్ 3840Hz PWM డిమ్మింగ్ రేట్‌ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా ముఖ్యంగా రాత్రి వేళళ్లో ఉపయోగిస్తున్నప్పుడు కళ్లకు హాని కలగకుండా చూస్తుంది. మరియు ఈ ఫోన్ ఆకట్టుకొనేలా ఉండేందుకు వీలుగా ఈ డివైజ్ సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంది.
ప్రీమియం డిజైన్
ఆకట్టుకొనే డిజైన్‌లు రెనో ఎప్పటి నుంచో కలిగి ఉంది. పెర్ల్ వైట్ వేరియంట్ వెల్‌వెట్ గ్లాస్ సాఫ్ట్ టచ్ ను అందిస్తుంది. అయితే వేలిముద్రలు కనిపించకుండా ఉంటాయి. ఫారెస్ట్ గ్రీన్ వేరియంట్ కెమెరా మాడ్యూల్ వద్ద లూమినస్ లూప్ ను కలిగి ఉంటుంది. బోల్డ్ లుక్‌తో పాలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ సన్నని స్లీక్ లుక్‌ను కలిగి ఉంటుంది. అంతమాత్రాన బలహీనమైన డివైజ్ కాదు. ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ 7i, స్పాంజ్ బయోనిక్ కుషనింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
బలమైన పోటీనిస్తుంది
రెనో14 5G మోడల్ ఇతర ఫోన్‌ల కంటే బెటర్ ఇమేజింగ్, రియల్ AI ఫీచర్లు మరియు మన్నికను అందిస్తుంది. పిక్సల్ 7a తో పోలిస్తే రెనో ఫోన్ సూపిరియర్ జూమ్, బెటర్ వీడియో కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది. గెలాక్సీ A55 పాలిష్ డిజైన్‌తో వచ్చినా రెనోలో కెమెరాలు, AI ఫీచర్లున్నాయి. వన్‌ప్లస్ CE4 పోటినిచ్చేలా అనిపించినా.. కెమెరా మరియు బిల్ట్ క్వాలిటీ విషయంలో రెనో ముందువరుసలో ఉంది.
అయితే రెనో14 5G స్మార్ట్‌ఫోన్ అన్ని ఫీచర్లను కలిగి ఉండాలని అనుకోలేదు. అయితే ఉన్న ఫీచర్లలో సూపర్ అనుభూతిని ఇచ్చేలా ఉండాలని మాత్రమే భావించింది.
అతిగా హామీ ఇవ్వలేదు.. కానీ చెప్పినవన్నీ సూపర్ ఫీచర్లే
OPPO Reno14 5G స్మార్ట్‌ఫోన్ అతిగా హామీ ఇవ్వలేదు. ఈ ఫోన్ మెరుగైన పోర్ట్రెయిట్ లెన్స్, ప్రో లెవల్ వీడియో టూల్స్, ఆకట్టుకొనే AI ఎడిటింగ్ ఫీటర్లు మరియు రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, ట్రావెలర్‌లు, ఇతర వినియోగదారులకు మాత్రం మెరుగైన అనుభూతిని అందించే అరుదైన ఫోన్‌గా ఉంది.

మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్‌లో బెస్ట్ కెమెరా ఫీచర్లు, బెస్ట్ బ్యాటరీ లైఫ్, ఆకట్టుకొనే AI టూల్స్, ప్రీమియం డిజైన్ ఫోన్ కోసం చూస్తుంటే రెనో14 5G స్మార్ట్‌ఫోన్ మీకు మెరుగైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్‌లో రియల్‌టైం ఫీచర్లను అందించింది.


Click it and Unblock the Notifications








