ఒప్పో దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్... వేడెక్కితే ఫోన్ కలర్ మారుతుంది.. పూర్తి వివరాలు..!
ఒప్పో భారత్ మార్కెట్ లో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఒప్పో రెనో14 5G దీపావళి ఎడిషన్ ను (OPPO Reno14 5G Diwali Edition) విడుదల చేసింది. హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో ఈ హ్యాండ్‌సెట్ ను తీసుకొచ్చింది. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ ఫోన్ ప్రత్యేక డిజైన్ ను కలిగి ఉంది. మరియు ఉష్ణోగ్రతలో మార్పు వస్తే కలర్ లో మార్పులు గమనించవచ్చు. ఈ టెక్నాలజీ ఆకట్టుకొనే అవకాశం ఉంది.
గ్లో షిఫ్ట్ టెక్నోలజీతో స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ :
ఒప్పో రెనో14 డిపావళి ఎడిషన్ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానల్ వేడెక్కినప్పుడు కలర్ మారేలా రూపొంచిందింది. గ్లో షిఫ్ట్ (GlowShift) టెక్నాలజీ గా పిలుస్తోంది. ఈ ఫోన్ 7.42mm థిక్‌నెస్, 187 గ్రాముల బరువును కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్ ల పూర్తి వివరాలు.

ఒప్పో రెనో14 దీపావళి ఎడిషన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది.
50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 3.5x ఆప్టికల్ జూమ్ తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 60fps వద్ద 4K HDR వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది.
మీడియాటెక్ చిప్‌సెట్, కలర్ OS :
ఈ ఒప్పో స్పెషల్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్ లు కూడా ఉన్నాయి.
6000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, రెండు రోజుల పాటు వినియోగించుకోవచ్చని ఒప్పో చెబుతోంది. IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఒప్పో రెనో 14 5G దీపావళి ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.39,999 గా ఉంది. అదే ప్రారంభ సేల్ లో భాగంగా రూ.36,999 కే కొనుగోలు చేయవచ్చని ఒప్పో తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications








