ఒప్పో రెనో15 సిరీస్ విడుదలపై కీలక వివరాలు లీక్.. వచ్చే వారంలో మరో రెండు ఫోన్‌లు..!
OPPO Reno15 Series Smartphones : ఒప్పో రెనో15 సిరీస్ నవంబర్ 17 వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్ లో భాగంగా రెనో15, రెనో15 ప్రో, రెనో15 మిని వంటి మోడల్స్ లాంచ్ కానున్నాయి. అయితే ఈ సిరీస్ భారత్ మార్కెట్‌లోనూ విడుదల కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లాంచ్, ధర సహా ఇతర వివరాలు లీక్ అయ్యాయి.
ఒప్పో రెనో15 సిరీస్ భారత్ లాంచ్ వివరాలను టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ వివరాలతో SmartPrix నివేదించింది. ఈ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కానుంది. అయితే 2026 ఫిబ్రవరి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. చైనాతో పోలిస్తే.. గ్లోబల్ మార్కెట్‌లో వేర్వేరు ప్రాసెసర్‌లను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒప్పో రెనో 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో రూ.43000 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై ఒప్పో సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతోపాటు స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా లీక్ అయ్యాయి.
స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో రెనో15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.
మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 3.5x ఆప్టికల్ జూమ్ 50MP టెలిఫోటో సెన్సర్‌ను ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ తో పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. అయితే మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలపై ఒప్పో స్పష్టమైన ప్రకటన చేయలేదు.
* భారత్ మార్కెట్‌లో ఒప్పో ఫైండ్ X9 సిరీస్ నవంబర్ 18 వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో ఫైండ్ X9 ఫోన్ రూ.75000 ధర రేంజ్, ప్రో మోడల్ రూ.1,00,000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా Hasselblad భాగస్వామ్యంతో 50MP సోనీ LYT 828 OIS కెమెరా, 50MP ISOCELL అల్ట్రావైడ్ లెన్స్, 200MP టెలిఫోటో లెన్స్ (OIS), 50MP సెల్ఫీ కెమెరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 7500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications