200MP కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో ఒప్పో సిరీస్.. ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే సహా ఫీచర్లు..!
OPPO Reno15 Series : ఒప్పో రెనో15 సిరీస్ లాంచ్ అయింది. ఇందులో భాగంగా రెనో15, రెనో15 ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు 200MP కెమెరాను కలిగి ఉన్నాయి. మరియు భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8450mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS సహా ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ సిరీస్ ధర, స్పెసిఫికేషన్ లు, ఫీచర్ల వివరాలు.
ఒప్పో రెనో 15 స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.32 అంగుళాల ఫ్లాట్ (2640 x 1216 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 200MP ప్రైమరీ కెమెరా, 3.5x 50MPపెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ 6200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ (Oppo Reno 15 Smartphone) IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రేటింగ్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఒప్పో రెనో 15 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్ తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా 200MP OIS కెమెరా, 3.5x జూమ్‌తో 50MP OIS పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్, 50W వైర్‌లైస్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఒప్పో సిరీస్ ధర, సేల్ వివరాలు :
ఒప్పో రెనో15 స్మార్ట్‌ఫోన్ 12GB/256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2999 (భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.37,424) గా ఉంది. ప్రో మోడల్ 16GB/1TB ధర CNY 3999 (భారత కరెన్సీ ప్రకారం రూ.49,896) గా ఉంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో 2026 ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చైనా వేరియంట్ తరహా ఫీచర్లనే కలిగి ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications