OPPO Reno15c Review : మిడ్‌రేంజ్ ధర సెగ్మెంట్‌లో బెస్ట్ ఫోన్.. ఎందుకో తెలుసా?
OPPO Reno15c స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారత్‌లో విడుదల అయింది. ఇటీవలే సేల్ కూడా ప్రారంభం అయింది. రెనో15 సిరీస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. Reno15 సిరీస్‌లోని స్టాండ్ అవుట్ సాఫ్ట్‌వేర్, కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను రెనో 15c ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా OPPO Reno15c స్మార్ట్‌ఫోన్ డిజైన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా మిగిలిన Reno15 సిరీస్ తరహాలో పనిచేస్తుందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్టైలిస్‌తోపాటు బిల్ట్ క్వాలిటీ పరంగా నాణ్యమైనది
OPPO Reno15c స్మార్ట్‌ఫోన్ ట్విటైల్ బ్లూ, ఆఫ్టర్‌గ్లో పింక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ట్విలైట్ బ్లూ వేరియంట్ క్లీన్, ఎలిగెంట్ టుక్‌ను కలిగి ఉంది. అదే మరో వేరియంట్ మృదువైన మెరుపుతో కూడిన సాఫ్ట్ ఫినిష్‌ను కలిగి ఉంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్ చుట్టూ సున్నితమైన గ్లో మరింత ఆకట్టుకుంటుంది. ఆఫ్టర్‌గ్లో ఫింక్ వేరియంట్‌లో ఆరా గ్లో కూడా ఉంది. విభిన్న లైటింగ్స్‌లో స్వల్ప రంగుల మార్పులను క్రియేట్ చేస్తుంది. ఫోన్ మరింత మెరిసేలా కాకుండా విలక్షణమైన అనుభూతిని అందిస్తాయి.
Reno15c మోడల్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు ఆర్మర్ బాడీతో దృఢంగా ఉంటుంది. దీంతోపాటు IP66 + IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. ప్రీమియం డిజైన్, బిల్ట్ క్వాలిటీతోపాటుగా 8.14mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. 195 గ్రాముల బరువు ఉంది.

OPPO Reno15c మోడల్ నాణ్యత, డిజైన్ తో ఆకట్టుకుంటుంది. దీంతోపాటు రోజువారీ ఎటువంటి ఆందోళన లేకుండా వినియోగించుకోవచ్చు. చేతిలో సౌకర్యవంతంగా ఉంటుంది. బాహ్యప్రాంతాల్లో వినియోగిస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఆందోళన ఉండదు.
AI సపోర్టుతో కూడిన ఫోటోగ్రఫీ
ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. f/1.8 అపేచర్, OIS సపోర్టుతో 50MP అల్ట్రా క్లియర్ ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు అల్ట్రావైడ్, మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. 100 డిగ్రీల ఫీల్డ్ వ్యూ యాంగిల్‌తో 50MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా ఉంది.

రోజువారీ వినియోగంలో Reno15c కెమెరాపై నమ్మకం ఏర్పడుతుంది. రంగులు నేచురల్‌గా అనిపిస్తాయి. దీంతోపాటు స్కిన్ టోన్ కూడా మరీ అతిగా ప్రాసెస్ చేసినట్లు అనిపించదు. వెలుతురు, నీడ వంటి సందర్భాల్లో సమతుల్యతను పాటిస్తుంది. ఇందులో OPPO PureTone ఇమేజింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాంట్రాస్ట్‌ను నియంత్రిస్తుంది. అవుట్‌డోర్, ఇన్‌డోర్ లైటింగ్‌లో ఫోటోలను క్యాప్చర్ చేసినప్పుడు ఆకట్టుకొనే విధంగానే వస్తాయి. ఫలితంగా కెమెరా నమ్మదగినదిగా అనిపిస్తుంది.
ఈ ఫోన్ ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. రికార్డింగ్ సమయాల్లో ఈ రెండు కెమెరాల మధ్య మారడం కూడా సులభంగానే ఉంటుంది. ఎక్స్‌పోజర్, రంగులు స్థిరంగా ఉంటాయి. క్యాజువల్ వ్లాగింగ్, ట్రావెల్ వీడియోలను ఆకట్టుకొనేలా క్యాప్చర్ చేస్తుంది. దీంతోపాటు డ్యూయల్ వ్యూ మోడ్ కూడా ఉపయోగపడుతుంది.
ఈ వీడియోలను ఎడిట్ చేసేందుకు, ఇతర యాప్‌ల అవసరం ఉండదు. ఫోన్‌లోనే సాఫ్ట్‌వేర్‌తోనే ట్రిమ్ చేయవడ్డు. స్పీడ్‌లో మార్పులు చేయవచ్చు. మ్యాజిక్ కూడా జత చేసుకోవచ్చు. ఈ ప్రక్రియంతా చాలా సులభంగా, నిమిషాల్లోనే పూర్తవుతుంది.

ఈ ఫోన్ మెరుగైన కెమెరా పనితీరుతోపాటు కెమెరా విభాగంలో సృజనాత్మకతను కలిగి ఉంది. పాప్‌అవుట్ వంటి ఫీచర్లు యూజర్లను బాగా ఉపయోగపడతాయి. AI Editor 3.0 ప్రాక్టికల్ అనుభూతిని అందిస్తుంది. AI Portrait లైటింగ్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
మెరుగైన అనుభూతిని ఇచ్చేలా
Reno15c స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 పైన పనిచేస్తుంది. రోజువారీ వినియోగికొనేందుకు సులభంగా ఉంటుంది. ఈ ఫోన్ 5 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని OPPO చెబుతోంది.

ఈ ఫోన్ యూనిమేషన్‌లు సరళంగా ఉంటాయి. యాప్‌లు త్వరగా తెరుచుకుంటాయి. దీంతోపాటు ఎక్కువ రోజుల వినియోగం అనంతరం పనితీరులో స్థిరత్వం ఎంతో ముఖ్యం. అయితే ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ తరహాలో ఎక్కువ సంవత్సరాల పాటు అప్‌డేట్స్‌ని పొందడం భరోసానిస్తుంది.
ఈ ఫోన్ లో మరో ఆసక్తికరంగా అనిపించే మరో ఫీచర్ ఉంది. అదే గూగుల్ జెమినితో మెరుగైన ఇంటిగ్రేషన్. సెట్టింగ్స్, క్యాలెండర్, క్లాక్ వంటి రోజువారీ పనుల కోసం వాయిస్ కమాండ్‌ను అనుమతిస్తుంది. ఏఐ మైండ్ స్సేస్ ద్వారా స్క్రీన్ పైన ఉన్న సమాచారాన్ని చిన్న గెశ్చర్ ద్వారా సేవ్ చేసి, అన్నింటినీ క్రమపద్ధతిలో అమర్చుతుంది. కెమెరా ద్వారా పోస్టర్లు, సైన్ బోర్డులను స్కాన్ చేసి, ఆయా వివరాలను సేకరిస్తుంది.
దీంతోపాటు జెమిని ఇంటిగ్రేషన్‌తో సేవ్ చేసిన నోట్స్, ఆర్టికల్స్‌ను ఉపయోగకరమైన అవుట్‌పుట్‌లుగా మార్చవచ్చు. ప్రయాణాల్లో రోజువారీ ప్రణాళికలను వేగంగా, మరింత సహజంగా చేస్తుంది. ఒప్పో ప్రత్యేకంగా రూపొందించిన క్లౌడ్ వ్యవస్థ ద్వారా డేటా సురక్షితంగా ఉంటుంది. గూగుల్ క్లౌడ్ కాన్ఫిడెన్షియల్ కంప్యూటింగ్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది.
మల్టీ టాస్కింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్
OPPO Reno15c స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి ఒకటిన్నర రోజు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 80W SuperVOOC TM ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. ఈ ఛార్జర్‌తో 64 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. 10 నిమిషాల క్విక్ ఛార్జింగ్‌తో 3.4 గంటలపాటు పనిచేస్తుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB ర్యామ్‌తో జతచేసి ఉంది. ఇది ఫ్లూయిడ్ మల్టీ టాస్కింగ్‌ను నిర్దారిస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే సుదీర్ఘ సెషన్‌లలోనూ స్థిరమైన ఫ్రేమ్ రేట్‌ను అందిస్తుంది. దీంతోపాటు ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. బలహీనమైన నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ మెరుగైన అనుభూతిని పొందుతారు. AI LinkBoost 3.0 ఫీచర్ కారణంగా ఈ సౌలభ్యం కలుగుతుంది.
ఆకట్టుకొనేలా డిస్‌ప్లే పనితీరు
OPPO స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 1.07 బిలియన్ కలర్స్‌ను సపోర్టు చేస్తుంది. టాస్క్‌ల ఆధారంగా రీఫ్రెష్ రేట్‌ను మార్చుకుంటుంది. అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఇందుకు కారణం.
ఈ ఫోన్ స్ల్పాష్ టచ్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు గ్లౌజ్ టచ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఫలితంగా గ్లౌజ్ వేసుకున్న చేతితోనూ ఈ ఫోన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ధర సెగ్మెంట్‌లో కేవలం డిజైన్ పరంగానే కాకుండా మెరుగైన విజువల్ అనుభూతిని కూడా అందిస్తుంది.
ఈ ధర సెగ్మెంట్‌లో సమతుల్యమైన పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్
OPPO Reno 15c స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. ఫోన్ సున్నితంగా కనిపిస్తునే దృఢంగా, తక్కువ బరువును కలిగి ఉంది. డిస్‌ప్లే, బ్యాటరీతో మెరుగైన పనితీరును అందిస్తుంది. హంగులు, ఆర్బాటాలు లేకుండా కెమెరా పరంగా స్థిరమైన పనితీరును అందిస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.
ప్రీమియం లుక్‌తోపాటు రోజువారీ పనితీరుతో ఆకట్టుకుంటుంది. ఫలితంగా ఈ ధర సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేస్తుంది. తక్కువ ధర కలిగిన మోడల్‌గా ఉన్నా.. డిజైన్, మన్నిక, ఫీచర్ల పరంగా ఎక్కడా రాజీపడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఫోన్‌లో హంగులు, ఆర్బాటాల కంటే నాణ్యతకు పెద్దపీట వేసినట్లు అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఈ ఫోన్ తిరురులేని ఆప్షన్‌గా నిలుస్తుంది.
OPPO Reno15c ధర, ఆఫర్ల వివరాలు
ఈ ఫోన్ 8GB/256GB ధర రూ.34999, 12GB/256GB ధర రూ.37999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను Amazon, Flipkart, OPPO e-Store తోపాటు ముఖ్యమైన రిటైల్ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులు, UPI లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. 12 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. దీంతోపాటు రూ.3000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. దీంతోపాటు తక్కువ ధరకే 180 రోజుల వరకు స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications








