ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్

By Maheswara
|
OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ స్మార్ట్-పరికరాల బ్రాండ్ అయిన ఒప్పో సంస్థ, తమ కొత్త ఫోన్ రెనో8 T 5G లాంచ్ తో భారతదేశంలో ఒప్పో రెనో సిరీస్ ను విస్తరిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా, ఒప్పో కొత్త టెక్నాలజీ లాంచ్ లకు మరియు నిజాయితీకి ప్రసిద్ధి చెందింది. ఇంకా,ఇప్పుడు ఈ కొత్త ఫోన్ లాంచ్ తో ఈ విషయాల్లో మరొక ముందడుగు వేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో8 మరియు ఒప్పో రెనో8 ప్రో 5G తో వినియోగదారులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్ తో రూపొందించబడింది, అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. ఒప్పో రెనో8 T 5G స్పెసిఫికేషన్ల విషయంలో ఖచ్చితమైన ఫీచర్లతో రూపొందించబడింది.

 

ఒప్పో రెనో8 T 5G ఫోన్ ని గొప్ప విలువ కలిగిన ఫోన్ గా మార్చే విషయాలు మరియు మీ షాపింగ్ జాబితాలో ఇది మొదటి స్థానంలో ఎందుకు ఉండాలి అని ఇప్పుడు చర్చించుకుందాం.

 

ఈ వివరాలు పూర్తిగా పరిశీలించడం కోసం, కొన్ని రోజుల పాటు మేము ఈ ఫోన్‌ను పరీక్షించాము. ఒప్పో రెనో8 T 5G ఫోన్ ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో తెలుసుకున్నాము.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

డిజైన్: అందమైన డిజైన్ మరియు ధృడమైన నాణ్యత కలిగి ఉంది

అందం అనేది చూసేవారి దృష్టిలో ఉంటుందని తెలిసిందే, కానీ మన చేతుల్లోకి ఒప్పో రెనో8 T 5G తీసుకున్నపుడు ఇది చాలా అందంగా అనిపిస్తుంది. మార్కెట్లో ఉన్న పోటీ లో మా సన్‌రైజ్ గోల్డ్ కలర్ రివ్యూ యూనిట్ ద్వారా పెద్ద సంఖ్యలోఈ ఫోన్ పై ఆసక్తి ని కనబరచడం ఈ వాస్తవానికి నిదర్శనం. మేము ఈ హ్యాండ్‌సెట్‌ను కొన్ని రోజులు మాత్రమే పరీక్షించాము , కానీ దాని డ్యూయెల్ మైక్రో కర్వ్‌డ్ బెవెల్‌లు అద్భుతమైన ఒప్పో గ్లో డిజైన్ ను కలిగి ఉన్నాయి. దురదృష్టవశాత్తు పాత్రికేయుల రూల్స్ ను పట్టించుకోని ప్రేక్షకుల నుండి పెద్ద సంఖ్యలో విచారణలు కూడా వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక ప్యానెల్ డిజైన్, గుండ్రని అంచులతో, డ్యూయల్-కెమెరా మాడ్యూల్‌ను నిలువుగా ఉండే డిజైన్ ను తీసుకువస్తుంది.

మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌ ఫోన్ ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు కలగలేదు, కానీ సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఫోన్ యొక్క ఉపరితలంపై ఉన్న మిలియన్ల కొద్దీ పిరమిడ్ ఆకారపు స్ఫటికాల డిజైన్ నుండి కాంతి ప్రతిబింబిస్తుంటే, మా సన్‌రైజ్ గోల్డ్ యూనిట్ ఖచ్చితంగా అబ్బురపరుస్తుంది. దీనిని, మాటలలో చెప్పడానికి కష్టం. మరియు ఈ అందం కేవలం ఫోన్ యొక్క పైన పొరల్లో మాత్రమే కాదు ఫోన్ నిర్మాణంలో కూడా కలిగి ఉంది. ఎందుకంటే వినియోగదారులకు మార్కెట్లోకి వచ్చే పరికరం పై మరకలు అంటకుండా ఉండటానికి మరియు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్‌ కోటింగ్ కూడా జరుగుతుంది.

అందం మరియు వాడటానికి అనువైన డిజైన్ తో అద్భుతమైన ఎర్గోనామిక్స్‌ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ దృఢమైన నిర్మాణంతో 171 గ్రాముల బరువును కలిగి ఉంది, అయితే సున్నితంగా వంగిన అంచులు మరియు అతి సన్నని 7.7 మిమీ మందం కలయిక కారణంగా ఇది మీ చేతిలో ఎక్కువ బరువు అనిపించదు. రెనో8 T 5G ఫోన్,మేము ఇప్పటి వరకు ఉపయోగించిన అత్యంత అనువైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది ఈ సెగ్మెంట్‌లలో అత్యంత సన్నని మరియు తేలికైన పరికరం, మీరు రోజంతా ఉపయోగించడానికి అత్యంత సౌకర్యవంతమైన పరికరం గా ఉంటుంది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

డిస్ప్లే: అద్భుతమైన ఆనందం కోసం తయారుచేయబడింది

మందకొడిగా 2D ప్యానెల్స్‌తో నిండిన నీరసమైన స్మార్ట్‌ఫోన్లు ఉన్న ప్రస్తుత మార్కెట్లో, రెనో8 T 5G యొక్క 6.7-అంగుళాల పటిష్టమైన మైక్రో-కర్వ్డ్ డ్రాగన్‌ట్రైల్-స్టార్2 అమోలెడ్ డిస్‌ప్లే మీరు టచ్ చేయడనికి అన్నదాని కలిగిస్తుంది. వంపు తిరిగిన ఈ స్క్రీన్ మొత్తం డిజైన్‌కు క్లాసిక్ లుక్ ని జోడిస్తుంది. ఇంకా,డిజైన్ కూడా ఈ పరికరాన్నిదృఢంగా ఉండేలా ఏర్పాటు చేస్తుంది. డిస్‌ప్లే చుట్టూ ఉన్న బెజెల్స్ కూడా చాలా స్లిమ్‌గా ఉంటాయి, దీని ఫలితంగా 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో వస్తుంది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

ఇంకా, ఈ డిస్‌ప్లే 10-బిట్ కలర్ సపోర్ట్‌తో వస్తుంది, ఇది పాత 8-బిట్ డిస్‌ప్లే టెక్నాలజీతో పోలిస్తే 64 రెట్లు మెరుగైన కలర్ ని చూపిస్తుంది. రెనో8 T 5G యొక్క డిస్‌ప్లే 1.07 బిలియన్ రంగులను ప్రదర్శించగలదు. కానీ, 8-బిట్ ప్యానెల్‌లు గరిష్టంగా 16.7 మిలియన్ రంగులతో మాత్రమే ఉంటాయి. ఇది అద్భుతమైన విషయం కదా?

కానీ మీరు ఒకవేళ నెట్‌ఫ్లిక్స్‌ను దాని హై-డెఫినిషన్ లో మీరు చూడలేకపోతే, ఆ రంగుల ప్రయోజనం ఏమిటి. అదృష్టవశాత్తూ, ఒప్పో మీకు పూర్తి వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్‌ను అందించడం ద్వారా దీని అందించింది. సామాన్యుల పరంగా, అది పూర్తి HD+ రిజల్యూషన్‌లో కల్తీ లేని అనుభవాన్ని అందిస్తుంది. అదే ఫీచర్ అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్‌కు మద్దతు ఇచ్చే అన్ని స్ట్రీమింగ్ సేవలకు కూడా విస్తరించబడింది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

ఇంకా, ఒప్పో యొక్క AI-మెరుగైన అడాప్టివ్ ఐ ప్రొటెక్షన్ సిస్టమ్ చీకటిలో కూడా సినిమా లను ఆస్వాదించడం కోసం కంటి ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. మేము మొత్తం వెబ్ సిరీస్‌లను చూసేటప్పుడు లేదా తెల్లవారుజామున పోటీ మొబైల్ షూటర్‌లను ప్లే చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ సేపు స్క్రీన్ ని చూసినప్పుడు కూడా ఎటువంటి సమస్యలు లేవు. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే120Hz రిఫ్రెష్ రేట్‌కి మద్దతిస్తుందని తెలుసా? పరికరం 120Hz 3D కర్వ్డ్ స్క్రీన్‌తో చాలా సన్నగా మరియు తేలికైనది అని నేను మీకు చెప్తాను. ఇది గేమింగ్ మరియు వెబ్ బ్రౌజింగ్ నుండి UI ద్వారా స్క్రోలింగ్ చేయడం వంటి విషయాల వరకు ప్రతిదీ మరింత ఆనందదాయకంగా చేసింది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

కెమెరా: హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు AI ల కలయికలో అద్భుతమైన కెమెరా

గొప్ప ఫోటోలను అప్రయత్నంగా క్యాప్చర్ చేయగల సామర్థ్యం మంచి ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్మార్ట్‌ఫోన్ మరియు పనితీరుకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఒప్పో రెనో8 T 5G దాని ప్రత్యేక AI-టెక్నాలజీ తో మరియు మీ కెమెరాను ఎలివేట్ చేసే తెలివైన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ తో అద్భుతమైన ఫోటోలను తీయగలదు. 108MP ప్రైమరీ కెమెరా సెన్సార్ లైఫ్ లాంటి చిత్రాలను క్యాప్చర్ చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ నిజంగా పూర్తి టెక్నాలజీ ని పనిచేసేది నిఫ్టీ నోనాపిక్సెల్ ప్లస్ బిన్నింగ్ టెక్నాలజీ.

ఈ ఫోన్ యొక్క తక్కువ-కాంతిలో ఫోటోగ్రఫీ ని చూసినప్పుడు మేము నిజంగా ఆశ్చర్యపోయాము. ఒప్పో దాని పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ ద్వారా స్పష్టమైన ఫోటోల కోసం 37 శాతం వరకు పనితనాన్ని పెంచుతుందని పేర్కొంది. కష్టమైన డిమ్ లైట్ ఫోటోలను కూడా పూర్తి సౌలభ్యంతో తీయవచ్చు. రెనో8 T 5G యొక్క కెమెరాలపై మాకు పూర్తిగా నమ్మకం కలిగించింది.

కెమెరా ఆప్టిమైజేషన్ ఈ ఫోన్ యొక్క సెకండరీ 2MP డెప్త్ సెన్సార్‌తో కొనసాగుతుంది, ఇది మెరుగైన పోర్ట్రెయిట్ బోకె ఫ్లేర్ ఎఫెక్ట్, పోర్ట్రెయిట్ మ్యాటింగ్ మరియు లెన్స్ ఫ్లేర్ రెండరింగ్ ఎఫెక్ట్‌ ఫోటోలను అందించడానికి ఒప్పో యొక్క సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్‌తో కలిసి పనిచేస్తుంది. దీనిలో మూడు 40x మైక్రోలెన్స్‌లు కూడా ఉన్నాయి, ఇవి మాక్రో ఫోటోగ్రఫీ కోసం వస్తువుకు చాలా దగ్గరగా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

అయితే, అందరూ హార్డ్‌కోర్ టెక్నికల్ ఫోటోగ్రఫీలో అనుభవం కలిగి ఉండరు. కొన్నిసార్లు మీరు మీ సోషల్ మీడియా ఫీడ్‌లలో షేర్ చేయడానికి గొప్ప సెల్ఫీని కోరుకుంటారు. దీనికి తగినట్లుగానే, ఈ ఫోన్ యొక్క హై-రిజల్యూషన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రూపొందించబడింది. అద్భుతమైన సెల్ఫీ HDR మోడ్‌తో కలిసి పని చేస్తున్న గొప్ప ఫ్రంట్ కెమెరా హార్డ్‌వేర్, అద్భుతమైన డైనమిక్ రేంజ్‌తో చాలా ఆకట్టుకునే సెల్ఫీలను అందించింది.

కెమెరా యొక్క డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్ వీ లాగర్ లకు ఒక వరం. కానీ, బోకే ఫ్లేర్ పోర్ట్రెయిట్ ఫీచర్ మాత్రం, మాకు ప్రత్యేకమైన కళాత్మక దృక్పథంతో ఫోటోలను క్లిక్ చేయడానికి అనుమతించింది. అదే సమయంలో, AI కలర్ పోర్ట్రెయిట్ మరియు ఒప్పో AI రీటౌచింగ్ వంటి ఇతర ముఖ్యమైన కెమెరా ఫీచర్‌లు వాస్తవ ప్రపంచ ఫోటోగ్రఫీ ప్రయోజనాలను అందిస్తాయి.

పనితీరు: భవిష్యత్తు కోసం తెలివైనదిగా రూపొందించబడింది.

ఒప్పో రెనో 8 T 5G ఫీచర్‌లతో వస్తుంది,అలాగే ఇది దాని అందమైన డిజైన్ కింద అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 SoC 5G చిప్‌సెట్ తో ఇది పనిచేస్తుంది. ఇది 6nm ఫాబ్రికేషన్ ప్రాసెస్‌పై నిర్మించబడింది. మేము చాలా బెంచ్‌మార్క్‌లు మరియు భారీ గేమింగ్ సెషన్‌లతో అన్నింటినీ పరీక్షించాము, అయితే ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్ కారణంగా ఈ పనులన్నీ ఎంతో సులువుగా నిర్వహించింది.

భారతదేశంలో 5G సేవలు అభివృద్ధి చెందుతున్నాయి, మీ తర్వాతి స్మార్ట్‌ఫోన్ నిజంగా 5Gకి సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఒప్పో రెనో8 T 5G భవిష్యత్
కోసం తయారు చేయబడిందని చెప్ప్పడానికి రుజువు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ యుట్యూబ్ ఛానెల్‌కి భారీ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారా లేదా పెద్ద గేమ్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నారా? ఈ ఒప్పో పరికరం మిమ్మల్ని నిరాశ పరచదు. కానీ మరీ ముఖ్యంగా, దాని 5G రేడియో యొక్క తక్కువ జాప్యం గేమింగ్ చేసేటప్పుడు కనీస పింగ్‌ను నిర్ధారిస్తుంది.

మల్టీ టాస్కింగ్ మరియు యాప్ లోడింగ్ సమయాలు ఈ పరికరం యొక్క 8GB RAM సామర్థ్యంతో సులువుగా నిర్వహిస్తుంది,ఈ ఫోన్లో వర్చువల్ RAM విస్తరణ ఫీచర్ ద్వారా 16GB వరకు మరింత పెంచుకోవచ్చు. కలర్OS 13 UI ద్వారా అద్భుతమైన అనుభవాన్ని అందించబడుతుంది. ఈ ఫోన్ యొక్క సాలిడ్ డైనమిక్ కంప్యూటింగ్ ఇంజిన్ 18 యాప్‌లను ఒకేసారి బ్యాక్‌గ్రౌండ్‌లో సులభంగా రన్ చేయగలదు.

ఒప్పో రెనో 8 T 5G అనేది రెనో లైనప్‌లో ఆండ్రాయిడ్ 13-ఆధారిత కలర్ OS 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ప్రారంభించిన మొదటి పరికరం. ఈ బ్రాండ్ రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు హ్యాండ్‌సెట్ కోసం నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను అందిస్తున్నది వాగ్దానం చేస్తుంది.

డేటా ప్రైవసీ ఖచ్చితంగా ముఖ్యమైన విషయం, కలర్ OS 13 ఈ ప్రభావానికి అధునాతన భద్రత మరియు గోప్యతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో స్మార్ట్ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, మీటింగ్ అసిస్టెంట్ మరియు ఆటో పిక్సలేట్ ఫీచర్ లు ఉన్నాయి. అలాగే, ఉదాహరణకు, ప్రైవసీ రక్షణ ఫీచర్ సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత స్వయంచాలకంగా క్లిప్‌బోర్డ్ కంటెంట్‌లను తొలగిస్తుంది. అదనంగా, ప్రైవేట్ సేఫ్ ఫీచర్ కూడా ప్రశంసలు పొందిన అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్ (AES)తో ఎన్‌క్రిప్ట్ చేయబడింది.

స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లలో డైరాక్ సరౌండ్ సౌండ్‌తో ప్యాక్ చేయబడింది-ఇది ఆడియోఫైల్స్‌కు నిజమైన ఫీచర్. మరింత ఆచరణాత్మక గమనికలో, మేము అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కూడా కనుగొన్నాము, ఇది స్పీకర్ వాల్యూమ్‌ను 200 శాతం వరకు పెంచుతుంది, ముఖ్యంగా శబ్దం లేని బహిరంగ ప్రదేశాలలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

బ్యాటరీ: మారథాన్ లాగా ఎక్కువ సమయం వస్తుంది

ఒప్పో రెనో8 T 5G ఫోన్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంది. కలర్ OS 13తో కలిపి ఈ బాటరీ ని సమర్థవంతమైన స్నాప్‌డ్రాగన్ 695 SoC కి అత్యుత్తమ పనితీరు ను అందిస్తుంది. ఇది స్ట్రీమింగ్ వీడియోలు, బ్రౌజింగ్, మ్యూజిక్ ప్లేబ్యాక్, UI నావిగేషన్, గేమింగ్ మరియు మరిన్నింటితో కూడిన మా కఠినమైన పరిస్థితులలో టెస్ట్ చేసినప్పుడు రోజంతా బ్యాటరీ లైఫ్‌ను కూడా అందించింది.

మీరు ఏదో ఒకవిధంగా బ్యాటరీని వాడినప్పటికీ, 67-వాట్ల SuperVOOCTM ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా దాదాపు 45 నిమిషాల్లో సున్నా నుండి 100 శాతం బ్యాటరీని రీఛార్జి చేయవచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్ సాధారణంగా బ్యాటరీ ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతున్నప్పటికీ, అది రెనో8 T 5Gకి సమస్య కాదు. ఒప్పో దాని బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE) మరియు 1600 వరకు బ్యాటరీ ఛార్జింగ్ సైకిల్‌లను అందజేస్తుందని చెప్పుకునే ఐదు-లేయర్ ఛార్జింగ్ రక్షణను కలిగి ఉంది. ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ 800 ఛార్జింగ్ సైకిల్స్ కంటే చాలా ఎక్కువ.

కానీ 48 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్ గ్యారెంటీ అనేది దీనికి అదనపు ప్రయోజనం అని గ్రహించడం గొప్ప విషయం, కానీ మూడు సంవత్సరాల పాటు అప్డేట్ లతో వినియోగదారుల కు గొప్ప అనుభవం అందించడంలో ఒప్పో హామీ ఇస్తుంది.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

ఫోన్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అభిప్రాయం

మీరు ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్నట్లైతే, ఒప్పో రెనో8 T 5G అన్ని ఫీచర్లను కలిగి ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ దాని పోటీ ఫోన్లను గెలిచే పనితీరును కలిగి ఉంది.ఈ ఒప్పో ఫోన్ యొక్క కెమెరా సిస్టమ్ మరియు అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, భారీ బ్యాటరీ, కంటెంట్‌ని వినియోగించడం కోసం అద్భుతమైన డిస్‌ప్లే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

ఒప్పో రెనో8 T 5G మీకు నిజమైన ఐదు స్టార్ ల స్మార్ట్‌ఫోన్ అనుభవం అందిస్తుంది. ఈ ఫోన్ రూ.29,999 ధరతో లాంచ్ చేయబడింది. ఇది ఫిబ్రవరి 10, 2023 నుండి సేల్ కు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ , ఒప్పో స్టోర్ మరియు మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ రెనో8 T 5G ఫోన్ రెండు రంగులలో సన్‌రైజ్ గోల్డ్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ లలో వస్తుంది. ఈ ఫొన్ పై ఫ్లిప్కార్ట్ మరియు ఒప్పో స్టోర్‌లో గొప్ప ఆఫర్‌ల కోసం చూడండి.

OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

మరోవైపు, ఒప్పో తమ వినియోగదారుల కోసం త్రీ-డైమెన్షనల్ లిజనింగ్ అనుభవం కోసం రెనో8 T 5Gతో పాటు సరికొత్త ఎన్కో ఎయిర్3 TWS ఇయర్‌ఫోన్‌లను కూడా పరిచయం చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు గ్లాస్ మూత డిజైన్‌ను కలిగి ఉంటాయి మరియు అద్భుతమైన 13.4mm డ్రైవర్‌లతో కాడెన్స్ HiFi5 DSPతో జతచేయబడి ఉంటాయి. ఇంకా, బ్లూటూత్ v5.2 మద్దతు ఎన్కో ఎయిర్3 TWS మరియు రెనో8 T 5G మధ్య స్థిరమైన కనెక్షన్‌ని అందిస్తుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు వ్యక్తిగతంగా ఆరు గంటల వరకు భారీ బ్యాకప్‌ను అందిస్తాయి మరియు ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 25 గంటలు వరకు బ్యాకప్‌ను అందిస్తాయి. కొత్త IP54-రేటెడ్ ఎన్కో ఎయిర్3 ఒక్కొక్కటి 3.75gm బరువు ఉంటుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ఫిబ్రవరి 10, 2023 నుండి ఇవి సేల్ చేయబడతాయి. వీటి ధర కేవలం ₹2999 గా ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
OPPO Reno8 T 5G First Look: Reigniting The Segment With Power-Packed Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X