భారత్‌లోనే Oppo స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఒప్పో (Oppo), భారత్‌లో సొంతంగా ప్రొడక్షన్ అలానే అసెంబ్లింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ నోయిడాలో ఈ యూనిట్‌లను నెలకొల్పే అవకాశముంది. Oppo స్మార్ట్‌ఫోన్‌లకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఈ ఫోన్‌‌లు అత్యధికంగానే అమ్ముడుపోతున్నాయి.

Read More : Jio కొత్త ఫీచర్, నచ్చిన కంటెంట్ డౌన్‌లోడ్ చేసేయండి

భారత్‌లోనే Oppo స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

గ్రేటర్ నోయిడాలో ప్రొడక్షన్ అలానే అసెంబ్లింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నట్లు బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌కు Oppo సమాచారం ఇచ్చిందట. ఎక్స్‌క్లూజివ్ ఆన్‌లైన్ సేల్స్ నిమిత్తం ఈ-కామర్స్ దిగ్గజం Flipkartతో ఒప్పొ ఇప్పటికే తన భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో తన F1s Rose Gold లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను ఒప్పో గురువారం మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.18,990గా ఉంది.

వాట్సాప్ నుంచి మేజర్ సెక్యూరిటీ అప్‌డేట్

భారత్‌లోనే Oppo స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ హబ్ ఏర్పాటే కాకుండా, మరో 1000 ఎకరాల విస్తర్ణీంలో రూ.1,400 కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్‌కు సంబంధించిన ఆపరేషన్స్ రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ ప్రకారం.. భారత్‌లో, అక్టోబర్ - డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు గాను 8 శాతం మార్కెట్ షేర్‌ను ఒప్పో నమోదు చేయగలిగింది.

సామ్‌సంగ్ 6జీబి ర్యామ్ ఫోన్‌ బుకింగ్స్ ప్రారంభం (రూ.36,900)

English summary
Oppo to start manufacturing smartphones in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting