ఆపరేషన్ 2013.. సామ్‌సంగ్‌కు గట్టిపోటి తప్పదా?

Posted By: Prashanth

ఆపరేషన్ 2013.. సామ్‌సంగ్‌కు గట్టిపోటి తప్పదా?

 

గూగుల్ బ్రాండెడ్ ఫోన్ ‘నెక్సస్ 4’ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ వెండర్ ఎల్‌జీ పూర్వ వైభవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న సామ్‌సంగ్, ఆపిల్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఓ కొరియన్ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల మేరకు ఎల్‌జీ తన ‘ఆప్టిమస్ జీ’ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌ను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్టిమస్ జీ2గా రూపుదిద్దుకుంటున్న ఈ అధిక ముగింపు గ్యాడ్జెట్ మే 2013నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని సదరు మీడియా సంస్థ తన నివేదికలో పేర్కొంది.

స్పెసిఫికేషన్‌లు (అంచనా):

5 అంగుళాల 440 పిక్సల్ స్ర్కీన్ (ఆపిల్ రెటీనా డిస్‌ప్లే‌తో పోలిస్తే 1.5రెట్టు పొదునైనది),

ఆమోల్డ్ డిస్‌ప్లే,

క్వాడ్‌కోర్ 2.0గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 5.0 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం.

సామ్‌సంగ్‌కు సవాల్:

ఆధునిక శ్రేణి స్సెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకుంటున్న ఎల్‌జీ ఆప్టిమస్ జీ2, సామ్‌సంగ్ కొత్తతరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4కు గట్టిపోటినివ్వగలదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత ఆవిష్కరణలను పరిశీలిస్తే గెలాక్సీ ఎస్3 అలానే గెలాక్సీ నోట్ 2లకు పోటీగా ఎల్‌జీ ఆప్టిమస్ జి, ఆప్టిమస్ వీయూ మోడళ్లలో సరికొత్త డివైజ్‌లను విడుదల చేసి ఆలస్యంగానైనా తన పోటీని తెలిపింది.

రూమర్ మిల్స్ ద్వారా సేకరించిన గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే....

5 అంగుళాల ఆమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

441 పిక్సల్ డెన్సిటీ,

2గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ15 ప్రాసెసర్,

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

ఆండ్రాయిడ్ 5.0 కీ లైమ్ పీ ఆపరేటింగ్ సిస్టం,

ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 16జీబి/32జీబి/64జీబి/128జీబి.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot