10000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తోంది...
జాన్ ఆరంభం నాటికి మార్కెట్లోకి...
చైనా ఫోన్‌ల కంపెనీ Oukitel, ఏకంగా 10000mAh బ్యాటరీ కెపాసిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కే10000 ప్రో పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్‌ను జాన్ ఆరంభం నాటికి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌తో పాటుగా వచ్చే 12V/2A ఫ్లాష్ ఛార్జర్ మొత్తం బ్యాటరీని మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేయగలుగుతుందట.

ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం కే10000 ప్రో స్పెసిఫికేషన్స్ .. 5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.5గిగాహెడ్జ్ మీడియాటెక్ MT6750T ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








