21000mAh: ప్ర‌పంచంలోనే అతిపెద్ద బ్యాట‌రీ ఫోన్, అతి త‌క్కువ ధ‌ర‌కు!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Oukitel, గ్లోబ‌ల్‌గా స‌రికొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ ను విడుద‌ల చేసింది. Oukitel WP19 పేరుతో ప్రపంచంలోనే అత్యంత సామ‌ర్థ్యం క‌లిగిన‌ 21000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవ‌ల AliExpress వేదిక‌గా విడుదల చేసింది. అయితే, ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ AliExpressలో ప్రపంచ ప్రీమియర్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపుతో ధ‌ర‌తో లభిస్తోంది.

 
21000mAh: ప్ర‌పంచంలోనే అతిపెద్ద బ్యాట‌రీ ఫోన్, అతి త‌క్కువ ధ‌ర‌కు!

ఈ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను $259.99 (రూ.23,927)కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫ‌ర్ పరిమిత కాలంలో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఈ సూపర్ డీల్ ఆగస్ట్ 26, 2022న ముగుస్తుందని విష‌యాన్ని గ‌మ‌నించాలి.

Oukitel WP19 ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త‌లు:
ఈ ఫోన్ యొక్క అద్భుత‌మైన ఫీచ‌ర్ ఏంటంటే.. 21000mAh సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాటరీ, ఇది మీ ఫోన్‌ను అడవిలో ఒక వారం పాటు కొనసాగించగలదు. Oukitel WP19 కఠినమైన అవుట్‌డోర్ ప‌రిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది. అంతేకాకుండా, ఇది సాహ‌స కృత్యాలు చేసేవారికి, టూరిస్టుల‌కు బాగా ఉప‌యోగప‌డుతుంది. ఈ భారీ బ్యాటరీని ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా మీకు ఒకే ఛార్జ్‌పై 7 రోజుల లైఫ్ అందిస్తుంది. అంతేకాకుండా, ఇది 33W ఫాస్ట్ ఛార్జర్ స‌పోర్ట్‌తో వ‌స్తోంది. ఫోన్‌ను 3 గంటల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇంకో ప్ర‌త్యేక‌మైన విష‌యం ఏంటంటే.. రివర్స్ ఛార్జింగ్ ఫంక్షన్‌తో, ఫోన్‌ను సులభంగా మినీ పవర్ బ్యాంక్‌గా మార్చవచ్చు.

21000mAh: ప్ర‌పంచంలోనే అతిపెద్ద బ్యాట‌రీ ఫోన్, అతి త‌క్కువ ధ‌ర‌కు!

Oukitel WP19 డిస్‌ప్లే, ప్రాసెస‌ర్‌:
ఈ హ్యాండ్‌సెట్ 6.79-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Oukitel WP19 మొబైల్‌ MediaTek Helio G95 ప్రాసెసర్‌తో 8GB మరియు 256GB స్టోరేజ్‌తో జత చేయబడింది. Oukitel WP19 డ‌స్ట్ మ‌రియు వాట‌ర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69K మరియు MIL-STD-810H రేటింగ్‌లను పొందుతుంది. త‌ద్వారా ఈ ఫోన్‌ చాలా బలంగా మరియు మన్నికగా ఉంటుంది. దీనితో పాటు, ఫోన్‌లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది.

Oukitel WP19 కెమెరా:
Oukitel WP19 ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను క‌లిగి ఉంటుంది. ఇందులో Samsung నుండి 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX350తో 20-మెగాపిక్సెల్ నైట్ విజన్ సెన్సార్ తో రెండో కెమెరా క‌లిగి ఉంది. ఇక మూడవది 3-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ను క‌లిగి ఉంది. ఈ ఫోన్ కెమెరాతో మీరు ఎండలో మరియు చీకటిలో కూడా మంచి క్వాలిటీ గల చిత్రాలను తీయవచ్చు. ఈ ఫోన్ ద్వారా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌కు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా అందిస్తున్నారు.

21000mAh: ప్ర‌పంచంలోనే అతిపెద్ద బ్యాట‌రీ ఫోన్, అతి త‌క్కువ ధ‌ర‌కు!

Oukitel WP19 బ్యాట‌రీ:
ఈ హ్యాండ్‌సెట్ యొక్క ప్రధాన ప్ర‌త్యేక‌త భారీ సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాటరీ. దీనికి 21,000mAh సామ‌ర్థ్యం క‌లిగిన బ్యాట‌రీని అందిస్తున్నారు. ఒక‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా ఈ బ్యాట‌రీ వారం రోజుల పాటు లైఫ్ ఇస్తుంది. ఫోన్‌ను 3 గంటల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే, రివర్స్ ఛార్జింగ్ ఫంక్షన్‌తో, ఫోన్‌ను సులభంగా మినీ పవర్ బ్యాంక్‌గా మార్చవచ్చు.

Oukitel WP19 డిస్కౌంట్ ఆఫ‌ర్ ఇలా:
ఈ Oukitel WP19 స్మార్ట్‌ఫోన్ సాధార‌ణ ధ‌ర అలీ ఎక్స్‌ప్రెస్‌లో రూ.82,510 గా ఉంది. కానీ, ప్ర‌స్తుతం ప్ర‌త్యేక డిస్కౌంట్ సేల్‌లో భాగంగా 71 శాతం త‌గ్గింపును అందిస్తోంది. త‌ద్వారా ఈ మొబైల్ కొనుగోలు దారుల‌కు కేవ‌లం రూ.23,927 కు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 26వ తేదీ తో ముగుస్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Oukitel WP19 Worlds Biggest Battery Rugged Smartphone Launched Globally

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X