బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్ ఏది..?

స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా అవతరించటానికి ప్రధానమైన కారణం వాటిలోనే ప్రత్యేకతలే. ఫోన్ కాల్స్ దగ్గర నుంచి వీడియో కాల్స్ వరకు, కెమెరా దగ్గర నుంచి క్యాలిక్యుటేర్ వరకు, చాటింగ్ దగ్గర నుంచి బ్లాగింగ్ వరకు ఇలా అన్ని పనులను స్మార్ట్‌ఫోన్‌లు చక్కబెట్టేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలోని సీపీయూ వ్యవస్థ అంతకంతకు బలపడుతుండటంతో ఆపరేటింగ్ సిస్టం, యాప్స్, కెమెరా విభాగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి.

Read More : Mi 5X vs Moto G5s Plus, తదుపరి పోరు వీటి మధ్యనే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రకరకాల చిప్‌సెట్‌లు..

మనం వాడుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ప్రధానంగా మీడియాటెక్, సామ్‌సంగ్ ఎక్సినోస్, స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్, ఇంటెల్ ఆటమ్, Spreadtrum, హైసిలికాన్ కైరిన్ వంటి చిప్‌సెట్‌లను ఫోన్ తయారీ కంపెనీలు ఉపయెగించటం జరుగుతోంది.

చిప్‌సెట్‌ను SoC అని పిలుస్తారు

వాస్తవానికి చిప్‌సెట్‌ను SoC అని పిలుస్తారు. సాక్ అంటే సిస్టమ్ ఆన్ చిప్ అని అర్థం. ఈ SoCలో ఒక్క ప్రాసెసర్ మాత్రమే కాదు బ్లుటూత్, జీపీఎస్, ఎల్టీఈ, వై-ఫై, సెన్సార్స్‌ కు సంబంధించిన హార్డ్‌వేర్‌ను అమర్చటం జరుగుతుంది. ఈ కారణంగా చిప్‌సెట్‌ అనేది ఫోన్‌కు గుండెకాయలాగా మారిపోతుంది.

ARM model ప్రాసెసర్స్

మీడియాటెక్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, సామ్‌సంగ్ ఎక్సినోస్, Spreadtrum వంటి చిప్‌సెట్‌లలో ARM model ప్రాసెసర్‌లను ఉపయోగించటం జరుగుతోంది. ఇంటెల్ చిప్‌సెట్‌లలో మాత్రమే Intel Atom ప్రాసెసర్‌లను ఉపయోగించటం జరుగుతోంది.

32-బిట్, 64-బిట్ స్టాండర్డ్‌లలో..

ARM model ప్రాసెసర్ అనేది 32-బిట్, 64-బిట్ స్టాండర్డ్‌లలో అందబాటులో ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసింగ్ టెక్నాలజీని 1987లో Acorn Computers అభివృద్ధి చేసింది. లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంలను సైతం ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలగుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న Intel, AMD ప్రాసెసర్లతో పోలిస్తే ARM model ప్రాసెసర్ భిన్నమైన ఆర్కిటెక్షర్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ ప్లాట్ ఫామ్ ను ఇంటెల్ 2012లో లాంచ్ చేసింది. Intel x86 ప్రాసెసర్లు ఆండ్రాయిడ్ ఆపరేటంగ్ సిస్టంను సపోర్ట్ చేస్తాయి.

చిప్‌సెట్‌ల మధ్య తేడాలు వాటి పనితీరు

మీడియాటెక్, సామ్‌సంగ్ ఎక్సినోస్, స్నాప్‌డ్రాగన్ క్వాల్కమ్, ఇంటెల్ ఆటమ్, Spreadtrum, హైసిలికాన్ కైరిన్ వంటి చిప్‌సెట్‌ల మధ్య తేడాలు ఇంకా పనితీరును ఇప్పుడు తెలుసుకుందాం....

మీడియాటెక్..

మీడియాటెక్ అనేది తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కెంపెనీ. చౌక ధరల్లో నాణ్యమైన మొబైల్ చిప్‌సెట్‌లను ఆఫర్ చేయాలన్నదే ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం. మీడియాటెక్ అందిస్తోన్న చిప్‌సెట్‌లను మైక్రోమాక్స్, లావా ఇంకా ఇతర చైనా స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించటం జరుగుతోంది. మీడియాటెక్ ఉత్పత్తి చేస్తోన్న చిప్‌సెట్‌లలో హెక్స్ కోర్ ఇంకా డెకా కోర్ చిప్‌సెట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ చిప్‌సెట్‌లపై రన్ అవుతోన్న ఫోన్‌లలో ఓవర్ హీటింగ్‌తో పాటు బ్యాటరీ డ్రెయినేజి అనేది ప్రధాన సమస్యగా ఉంది. మీడియాటెక్ ఈ విషయాల పై ప్రధానం ఫోకస్ చేయవల్సి ఉంది.

క్వాల్కమ్..

Qualcomm అనేది యూఎస్‌కు చెందిన ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ. Snapdragon చిప్‌సెట్‌లను Qualcomm ఉత్పత్తి చేస్తుంది. మీడియాటెక్ అందించే చిప్‌సెట్‌లతో పోలిస్తే క్వాల్కమ్ ఆఫర్ చేసే చిప్‌సెట్‌లు మరింత ఖరీదైనవి. పనితీరు కూడా అదేవిధంగా ఉంటుంది. హై-ఎండ్ చిప్‌సెట్‌లను తయారు చేయటంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ దిట్ట. Snapdragon అందించే చిప్‌సెట్‌లలో హీటింగ్ సమస్య తక్కువ. స్నాప్‌డ్రాగన్ గతంలో ఆఫర్ చేసిన 801 చిప్‌సెట్‌‌లో మాత్రం హీటింగ్ సమస్య ఎక్కువుగా ఉంది. ఈ కంపెనీ అందిస్తోన్న చిప్‌సెట్‌లలో స్నాప్‌డ్రాగన్ 836 లేటెస్ట్ మోడల్. నుబియా జెడ్17, వన్‌ప్లస్ 5 వంటి హై-ఎండ్ ఫోన్లు ఈ చిప్‌సెట్‌తో వస్తున్నాయి. ఇండిపెండెంట్‌గా పనిచేయగలిగే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు బ్యాటరీని కూడా చాలా తక్కువుగా ఖర్చు స్తాయి.

సామ్‌సంగ్ ఎక్సినోస్

Samsung Exynos ఎక్సినోస్ ప్రాసెసర్‌లను సామ్‌సంగ్ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాసెసర్లను సామ్‌సంగ్ అందిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్‌‌లలో వినియోగిస్తున్నారు. ఇటీవల మిజు కంపెనీ ఫోన్‌లలో ఎక్సినోస్ చిప్‌సెట్‌లు కనిపిస్తున్నాయి. ఎక్సినోస్ ప్రాసెసర్లు గ్రాఫిక్ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. అయితే lagging సమస్యలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి.

Spreadtrum

చైనాకు చెందిన Spreadtrum కంపెనీ చౌకధర చిప్‌సెట్‌లను అభివృద్ధి చేస్తోంది. Spreadtrum చిప్‌సెట్‌లు ఇంచుమించుగా మీడియాటెక్ చిప్‌సెట్‌ల మాదిరిగానే ఉంటాయి. ధర కూడా చాలా తక్కువ.రిలయన్స్ జియో అందించబోతోన్న 4జీ ఫీచర్ ఫోన్‌లలో ఈ చిప్‌సెట్‌లను వినియోగించబోతున్నట్లు సమాచారం.

ఇంటెల్..

కంప్యూటర్ చిప్‌ల తయారీలో అగ్రగామిగా పేరొందిన ఇంటెల్ తాజాగా స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌ల తయారీ పైనా దృష్టిసారించింది. hyperthreadingతో వచ్చే ఇంటెల్ చిప్‌సెట్‌లు వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను ఆఫర్ చేస్తాయి. ఇంటెల్ ఆటమ్ సాక్‌లు కొంత హీట్‌ను జనరేట్ చేస్తున్నప్పటికి బ్యాటరీ పవర్‌ను మాత్రం చాలా పొదుపుగా వాడుకుంటాయి. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన జెన్ ఫోన్ జూమ్, జెన్ ఫోన్2లు ఇంటెల్ ఆటమ్ చిప్‌సెట్‌లతో రన్ అవుతున్నాయి.

హువావే హైసిలికాన్

హైసిలికాన్ కైరిన్ చిప్‌సెట్‌లను హువావే కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇవి బ్యాటరీ శక్తిని చాలా తక్కువగా ఖర్చుచేస్తున్నప్పటికి పనితీరు పరంగా ఇతర కంపెనీల చిప్‌సెట్‌లతో పోలిస్తే వెనుక‌బడి ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Our mobile chipset guide. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot