ఈసారి శాంసంగ్‌దే రికార్డు : రెండురోజులు..లక్ష ఫోన్లు

Written By:

మొబైల్ హ్యాండ్‌సెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న శాంసంగ్ తన తాజా ఫోన్‌తో తనకెవ్వరూ మార్కెట్లో సరిజోడిలేరని నిరూపించింది. శాంసంగ్ నుంచి తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రెండు రోజ్లోనే లక్షకు పైగా ఫోన్లు అమ్ముడుపోయాయని కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ హ్యాండ్ సెట్స్ శుక్రవారం 60 వేలు, శనివారం 40 వేలకు పైగా విక్రయాలు జరిగాయని ఓ అధికారిక సైట్ లో వివరాలు అప్ డేట్ చేశారు.

ఈసారి శాంసంగ్‌దే రికార్డు : రెండురోజులు..లక్ష ఫోన్లు

ఈ రెండు రకాల హ్యాండ్ సెట్స్ గత నెలలో స్పెయిన్ లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ మొబైల్స్ పై స్మార్ట్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఈ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇక మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితంగా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: శాంసంగ్ గెలాక్సీ ఎస్7 వీడియో లీకయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ.

 

 

2

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్

 

 

3

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

 

4

డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

5

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు.

 

 

6

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. యాప్ పర్మిషన్, గూగుల్ నౌ ఆన్ టాప్, డోజ్ మోడ్, ర్యామ్ మేనేజర్, ఆటో బ్యాకప్, బ్యాటరీ లైఫ్, ఆటో హ్యాండ్లింగ్ యాప్స్, ఆండ్రాయిడ్ పే వంటి ప్రత్యేక ఫీచర్లను ఎస్7 ఎడ్జ్ అందిస్తుంది.

 

 

7

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్ కు "Always-On Display" ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ఫోన్ స్ర్కీన్ పై ఎఫ్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. క్లాక్, నోటిఫికేషన్స్, క్యాలెండర్‌లను ఈ ఫీచర్ డిస్‌ప్లే సూచిస్తుంది. తద్వారా చీటికి మాటికి పోన్‌ను ఓపెన్ చేయకుండా బ్యాటరీ ఆదా చేయవచ్చు.

8

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

 

9

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

 

 

10

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ బ్లాక్ ఆనియక్స్, గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ టైటానియమ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటంది.

 

 

12

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Over 100,000 units Galaxy S7 series sold in first two days
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot