ఇండియాకి రాకముందే ఈ ఫోన్‌ని 2.5 లక్షల మంది బుక్ చేసుకున్నారు

Written By:

దక్షిణకొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ తాజా స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌8కు భారీగా ప్రీ-బుకింగ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్‌ 12న భారత్‌లో లాంచ్‌ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి, ఇప్పటికే 2.5 లక్షలకు పైగా కస్టమర్లు రిజిస్ట్రర్‌ చేసుకున్నారు. అయితే ఇదే రోజు శాంసంగ్‌ ప్రత్యర్థి కంపెనీ ఆపిల్‌ కూడా తన 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతుంది.

మీ వాట్సప్ ప్రొఫైల్ ఎవరు చూసారో తెలుసుకోవడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సారి నువ్వా నేనా అన్నట్లు

ఆపిల్, శాంసంగ్ ఈ సారి నువ్వా నేనా అన్నట్లు తలపడబోతున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8ను భారత్‌లో లాంచ్‌ చేస్తుండగా... ఆపిల్‌ కాలిఫోర్నియా, కూపర్టినోలోని తన కొత్త క్యాంపస్‌ స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఐఫోన్‌ 8ను లాంచ్‌ చేస్తోంది.

తన ఆధిపత్యాన్ని

ఐఫోన్‌ లాంచ్‌ గురించి తెలిసిన శాంసంగ్‌ ఈ ఈవెంట్‌ను భారత్ లో నిర్వహిస్తుందని, స్మార్ట్‌ఫోన్లకు ఎంతో ప్రతిష్టాత్మకమైన మార్కెట్‌ భారత్‌లో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తుందని తెలిపాయి

అంతర్జాతీయ మార్కెట్లోకి

ప్రస్తుతం భారత్‌లోకి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌, ఆగస్టులో దక్షిణ కొరియాలో లాంచైంది. బిక్స్బీ ఇంటెలిజెంట్‌ అసిస్టెంట్‌, వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌, ఐరిస్‌ స్కానర్‌తో ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చింది.

1.5 లక్షలు అమెజాన్‌ నుంచి

కాగా శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8కు వెల్లువెత్తుతున్న ప్రీ-బుకింగ్స్‌లో 1.5 లక్షలు అమెజాన్‌ నుంచి వచ్చాయి. మిగతా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి వచ్చాయని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి.

గెలాక్సీ నోట్‌8 ఫీచర్ల విషయానికొస్తే

6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (రిసల్యూషన్1440x 2960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

గెలాక్సీ నోట్‌8 ఫీచర్ల విషయానికొస్తే

12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఐపీ68 సర్టిఫికేషన్, సామ్‌సంగ్ పే సపోర్ట్, డ్యుయల్ సిమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, ఎల్టీఈ క్యాట్ 16 కనెక్టువిటీ, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటర్,Samsung Bixby వాయిస్ అసిస్టెండ్ సపోర్ట్. సామ్‌సంగ్ ఎస్ పెన్ సౌకర్యం.

ధర ఎంత అనేది

ఇండియాలో ఈ ఫోన్ ధర  ఎంత అనేది కంపెనీ ఇంకా డిసైడ్ చేయలేదు. లాంచింగ్ రోజున ప్రకటించే అవకాశం ఉంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Over 2.5 lakh people pre-book Samsung Galaxy Note 8 in India Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot