కింద పడినా పగలని స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీమియమ్ బిజినెస్ స్పెసిషికేషన్‌లతో కూడిన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ కంప్యూటర్‌ను పానాసోనిక్ కంపెనీ మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Toughpad FZ-F1, Toughpad FZ-N1, Toughpad FZ-A2 మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ డివైస్‌లను రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.

కింద పడినా పగలని స్మార్ట్‌ఫోన్‌లు

మన్నికతో పాటు బలిష్టంగా కనిపించే ఈ డివైస్‌లను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. FZ-F1, FZ-N1 స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉన్నాయి. అయితే వీటిలో ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. FZ-F1 మోడల్ విండోస్ 10 IoT మొబైల్ ఎంటర్‌ప్రైజ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇదే సమయంలో FZ-N1 మోడల్ ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ ధర రూ.99,000. విండోస్ 10 మొబైల్ వర్షన్ ధర రూ.1,09,000.

కింద పడినా పగలని స్మార్ట్‌ఫోన్‌లు

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి... ఆక్టా కోర్ 2.3GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సాక్, 2జీబి ర్యామ్, 4.7 అంగుళాల HD (720x1280) డిస్‌ప్లే, 16జీబి స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (Wi-Fi, 2G/EDGE/3G/4G LTE, GPS, NFC, Bluetooth (v4.1), MicroUSB), ఫీల్డ్ వర్క్‌కు అవసరమైన యాంగ్యులర్ 1D/ 2D Barcode readerను కూడా ఈ ఫోన్‌లలో పానాసోనిక్ పొందుపరిచింది.

కింద పడినా పగలని స్మార్ట్‌ఫోన్‌లు

ఇక టాబ్లెట్ విషయానికి వచ్చేసరికి పానాసోనిక్ ఆఫర్ చేస్తున్న Toughpad FZ-A2 డివైస్ ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ధర రూ.1,20,000. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి... 1.44GHz ఇంటెల్ ఆటమ్ x5-Z8550 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 10.1 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1920x1200పిక్సల్స్) విత్ ఫ్లెక్సిబుల్ బిజినెస్ కస్టమేజేషన్స్ ఆప్షన్స్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (Wi-Fi, GPS, NFC, Bluetooth (v4.1), MicroUSB).

English summary
Panasonic brings Toughpad smartphones and tablet to India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot