భారత్‌లోకి పానాసోనిక్ ఇల్యుగా స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ పానాసోనిక్ (Panasonic) త్వరలో పలు ప్రీమియమ్ శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో ప్రవేశపెట్టబోయే ఈ ఇల్యుగా(Eluga) శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను పానాసోనిక్ 2012 ఫిబ్రవరిలో యూరోప్ మార్కెట్లో పరిచయం చేసింది. అక్కడ ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఇప్పుడు అదే ఇల్యుగా శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను పానాసోనిక్, ఇండియన్ యూజర్లకు పరిచయం చేయబోతోంది. ఈ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పానాసోనిక్ "Elegance for a new generation" ట్యాగ్‌లైన్‌తో ఓ టీజర్‌ను విడుదల చేసింది.

భారత్‌లోకి పానాసోనిక్ ఇల్యుగా స్మార్ట్‌ఫోన్‌లు

పానాసోనిక్ గతంలో విడదల చేసిన ‘పానాసోనిక్ ఇల్యుగా' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్‌తో), ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1150ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ తత్వం.

భారత్‌లో విడుదల కాబోయే పానాసోనిక్ ఇల్యుగా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ కంపెనీ నుంచి గత నెలలో విడుదలైన ఆక్టా కోర్ ఫోన్ పానాసోనిక్ పీ81.

పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ (వీడియో రివ్యూ)

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot