దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోతున్న పానాసోనిక్ దిగ్గజం తొలిసారిగా అది పెద్ద బిగ్ డిస్ ప్లేతో ఓ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 18:9 aspect ratioతో పాటుఅద్భుతమైన ఫీచర్లతో ఈ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. Panasonic Eluga Ray 550 పేరుతో వచ్చిన ఈ 4జీ ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగుల్లో యూజర్లకి ప్రత్యేకంగా లభ్యం కానుంది. కాగా ఈ ఫోన్ వినియోగదారులకు రూ.8,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ అర్బో, భారీ స్క్రీన్, స్మార్ట్ లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్‌లో ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే ముందు, వెనుక భాగాల్లో రెండు కెమెరాలకు ఫ్లాష్‌తో తీసుకొచ్చింది. ముఖ్యంగా రెడ్ మి 5 కు పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దూసుకురావడం విశేషం.
పానసోనిక్ ఎలుగా రే 550 ఫీచర్లు
5.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 18.9యాస‍్పెక్ట్ రేషియో
1440 x 720 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.5 కర్వ్‌డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13 ఎంపీ బ్యాక్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
3250 ఎంఏహెచ్ బ్యాటరీ
స్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం
ఈ ఫోన్ లాంచింగ్ సంధర్భంగా బిజినెస్ హెడ్ పంకజ్ రానా మాట్లాడుతూ మేము 'Big View Display' స్మార్ట్‌ఫోన్ కేటగిరిలోకి ఎంటర్ అవుతున్నామని కస్టమర్లకు ఓ మంచి అనుభూతిని అందించే విధంగా మేము ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇకపై పానాసోనిక్ నుంచి రానున్న ఫోన్లు అత్యంత పవర్ పుల్ ఫీచర్లతో మార్కెట్లోకి రానున్నాయని క్వాలిటీతో పాటు యూజర్లను ఆకట్టుకునే విధంగా ఇవి ఉండనున్నాయని తెలిపారు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.