బడ్జెట్ ధరలో భారీ డిస్‌ప్లే 4జీ స్మార్ట్‌ఫోన్

ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మొబైల్ ఫోన్ల హవా నడుస్తోంది. దాదాపుగా అన్ని కంపెనీలు ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఫోన్లను ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

|

ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మొబైల్ ఫోన్ల హవా నడుస్తోంది. దాదాపుగా అన్ని కంపెనీలు ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఫోన్లను ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, పానాసోనిక్ మాత్రం బడ్జెట్ ధరలోనే 18:9 రేషియోతో ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే ఫోన్ 'పి101' ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,999. ఆఫ్‌లైన్‌ రిటైలర్‌ సంగీత మొబైల్స్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.బడ్జెట్‌ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను పానాసోనిక్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

ఏప్రిల్ 19న Honor 10, మే 15న Honor 10 Pro, హైలెట్ ఫీచర్లు ఇవేఏప్రిల్ 19న Honor 10, మే 15న Honor 10 Pro, హైలెట్ ఫీచర్లు ఇవే

panasonic p101

ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన తన కస్టమర్లకు ఐడియా సెల్యులార్‌ 60జీబీ డేటాను అందిస్తోంది. రూ.199 రీఛార్జ్‌పై 28 రోజుల పాటు అందనంగా 10జీబీ డేటా చొప్పున ఆరు సార్లు ఆఫర్‌ చేయనుంది. అదనంగా ఐడియా యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తోంది. ఈ ఫోన్లో 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీ, 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ పెంపు, వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా, ఫ్లాష్, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. 5.45 అంగుళాల స్క్రీన్ కలిగిన మొబైల్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1పై పనిచేస్తుంది. 4జీ వోల్టేకు సపోర్ట్, యాసిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్, యాంబిట్ లైట్ సెన్సార్, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. బరువు 145 గ్రాములు.

పానాసోనిక్‌ పీ101 స్పెషిషికేషన్లు
5.45 అంగుళాల బిగ్‌ వ్యూ ఐపీఎస్‌ డిస్‌ప్లే విత్‌ 2.5 కర్వ్‌డ్‌ స్క్రీన్‌
డ్యూయల్‌ సిమ్‌
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌
1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్
2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత స్టోరేజీ
128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజీ పెంపు
వెనుకవైపు 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ కెమెరా ఫ్లాష్
ముందువైపు 5 మెగా పిక్సల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్
4జీ వోల్టేకు సపోర్ట్
2,500 ఎంఏహెచ్ బ్యాటరీ
బరువు 145 గ్రాములు

Best Mobiles in India

English summary
Panasonic P101 Budget Smartphone With 18:9 Display Launched in India: Price, Specifications More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X