పానాసోనిక్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ ప్రొటెక్షన్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ,000mAh బ్యాటరీ..
పానాసోనిక్ ఇండియా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. Eluga A3, Eluga A3 Pro మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఎల్యుగా ఏ3 మోడల్ ధర రూ.11.290, ఎల్యుగా ఏ3 ప్రో మోడల్ ధర రూ.12,790. మెటల్ బాడీ డిజైన్‌లతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసారు.

Eluga A3 స్పెసిఫికేషన్స్...
5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, ఓటీజీ, మైక్రో యూఎస్బీ 2.0. ‘Arbo' పేరుతో ప్రత్యేకమైన వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

Eluga A3 Pro స్పెసిఫికేషన్స్...
5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్), డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4,000mAh బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, ఓటీజీ, మైక్రో యూఎస్బీ 2.0.

ఏప్రిల్ 10 నుంచి అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్ 10 నుంచి అన్రి ప్రముఖ పానాసోనిక్ బ్రాండ్ స్టోర్‌లతో పాటు మేజర్ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








