రూ.13,290కే పానాసోనిక్ Eluga Note
జపాన్‌కు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ తన Eluga సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Eluga Note పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.13,290.

గోల్డ్ కలర్ ఆప్షన్‌లో విడుదలైన ఈ ఫోన్ అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో దొరుకుతోంది. మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న షియోమీ ఎంఐ మాక్స్, లెనోవో కే4 నోట్, రెడ్మీ నోట్ 3 ఫోన్‌లకు Eluga Note ప్రధాన కాంపిటీటర్‌గా నిలవనుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించిట్లయితే...
Read More : లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

డిస్‌ప్లే విషయానికొస్తే...
Eluga Note స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ లో టెంపరేచర్ పాలీక్రిస్టలిన్ సిలికాన్ టెక్నాలజీతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం...
Eluga Note స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Masrhmallow ఆపరేటింగ్ సిస్టం టాపుడ్ విత్ ఫిట్‌హోమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

ప్రాసెసర్, ర్యామ్
Eluga Note స్మార్ట్‌ఫోన్.. 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ అలానే 3జీబి ర్యామ్ సపోర్ట్‌తో వస్తోంది.

స్టోరేజ్
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ట్రిపుల్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సూపర్ క్లారిటీ 4 పిక్సల్ లెన్స్,

కనెక్టువిటీ పీచర్లు
డ్యుయల సిమ్ సపోర్ట్, 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,

బ్యాటరీ
Eluga Note స్మార్ట్‌ఫోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

కాంపిటీషన్ ఎవరితో...
మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న షియోమీ ఎంఐ మాక్స్, లెనోవో కే4 నోట్, రెడ్మీ నోట్ 3 ఫోన్‌లకు Eluga Note ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications








