రూ.5,999కే, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ పానాసోనిక్ తన బడ్జెట్ ఫ్రెండ్లీ లైనప్ నుంచి 'పీ75'(P75) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.5,999.

ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ మెయిన్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లుటూత్), 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Read More : గూగుల్ క్రోమ్‌ను నోట్‌ప్యాడ్‌లా వాడుకోవటం ఎలా..?

పానాసోనిక్ పీ75 స్పెషల్ ఫీచర్స్...
ఈ ఫోన్ ప్రత్యేకమైన పానాసోనిక్ సెయిల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. ఫైల్ మేనేజర్, గెస్ట్యర్ కంట్రోల్, బ్యాచ్ అరేంజింగ్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఆకట్టుకుంటాయి.

పానాసోనిక్ పీ75 స్పెషల్ ఫీచర్స్...
డివైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన థీమ్ క్లబ్ ఫీచర్ ద్వారా యూజర్ తన అభిరుచులకు అనుగుణంగా, ఫోన్ థీమ్స్ మార్చుకుంటూ కొత్త లుక్స్‌ను ఆస్వాదించవచ్చు.

పానాసోనిక్ పీ75 స్పెషల్ ఫీచర్స్...
పానాసోనిక్ పీ75 ఫోన్ గూగుల్ జీపీఎస్ నేవిగేషన్ యాప్‌ను సపోర్ట్ చేస్తుంది. టర్న్ బై టర్న్ అసిస్టెన్స్‌తో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

పానాసోనిక్ పీ75 స్పెషల్ ఫీచర్స్...
పానాసోనిక్ పీ75 ఫోన్, రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. చాంపేన్ గోల్డ్, సాండ్ బ్లాక్.

పానాసోనిక్ పీ75 స్పెషల్ ఫీచర్స్...
5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లో బ్యాకప్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కు ఈ హ్యాండ్ సెట్ బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications








