స్సెషల్ ఆఫర్‌లో టాబ్లెట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోండి!

Posted By: Staff

 స్సెషల్ ఆఫర్‌లో టాబ్లెట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోండి!

 

ఇటీవల నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’ గ్యాడ్జెట్ ఉత్సాదక బ్రాండ్ పాన్‌టెక్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రెండు సరికొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌లను ఈ వేదిక పై పాన్‌టెక్ ఆవిష్కరించింది. వీటిలో మొదటిది పాన్‌టెక్ బరస్ట్ (Pantech Burst), రెండోది పాన్‌టెక్ ఎలిమెంట్ ( Pantech Element)...

పాన్ టెక్ బరస్ట్:

యూజర్ ఫ్రెండ్టీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఉత్తమమైన పనితీరును ప్రదర్శిస్తుంది. 4జీ LTE వ్యవస్థను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,

* డ్యూయల్ కర్ ప్రాసెసర్,

* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,

* వీడియో కాలింగ్ కోసం వీజీఏ ఫ్రంట్ కెమెరా,

* 16జీబి ఇంటర్నల్ మెమెరీ,

* 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,

పాన్ టెక్ ఎలిమెంట్:

సమర్ధత కలిగిన ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ టాబ్లెట్ కంప్యూటర్ చమ్మ ఇతర ప్రతికూల వాతవరణాలను తట్టుకునే పటిష్ట వ్యవస్థను కలిగి ఉంది. ఇతర ఫీచర్లు:

* డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,

* 8 అంగుళాల TFT XGA టైప్ డిస్‌ప్లే,

* 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా,

* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యక్ష వీడియో కాలింగ్ కోసం),

* బ్యాటరీ బ్యాకప్ 12 గంటలు.

ప్రత్యేక ఆఫర్‌తో ఈ రెండు గ్యాడ్జెట్‌లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు పాన్‌టెక్ సన్నాహాలు చేస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot